health tips in telugu
కొత్తిమీర అని తేలిగ్గా తీసి పారేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
కొత్తిమీరను హా కొత్తిమీరేగా అని తేలిగ్గా తీసి పారేయకండి. ప్రతిరోజూ కొత్తిమీరను ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే దీనిని మీరు అసలు నిర్లక్ష్యం చేయరు. కొత్తిమీర వలన కలిగే ఉపయోగాలను పరిశీలిస్తే..
చక్కని సువాసన, కమ్మని రుచి కొత్తిమీర సొంతం. ఇది మనం తినే ఆహార పదార్థాల రుచిని రెట్టింపు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కెలతో పాటు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.

శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షుగర్ వ్యాధితో బాధ పడేవారు కొత్తిమీరను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
నోటిలో ఏర్పడే పూతలను నివారిస్తుంది. నోటి దుర్వాసనను, చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.