మహిళల పాలిట వరం దాల్చినచెక్క.. అది ఎలానో తెలుసుకోండి
Dalchina Chekka: దాల్చిన చెక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాంసాహార వంటకాలలో విధిగా ఉపయోగించేది. మసాల రుచి కోసం దీన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల కూరకు చక్కని రుచి, వాసన వస్తుంది. చిన్నిమామం అనే చెట్టు బెరడు నుంచి దీనిని సేకరిస్తారు. అలాంటి దాల్చిన చెక్క కేవలం మాంసాహార వంటకాలలో రుచి కోసమే కాకుండా, అనేక రోగాల్ని నివారించడానికి కూడా పనికొస్తుంది.
ఇది ముఖ్యంగా మహిళల అనారోగ్య సమస్యలకు దివ్యౌషదంగా పనిచేస్తుంది.
అధిక బరువుతో బాధపడుతున్నవారు రోజూ ఒక కప్పు నీటిలో మూడు టీ స్ఫూన్‌ల దాల్చిన చెక్క పొడిని, రెండు టీ స్ఫూన్‌ల తేనేతో కలిపి రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

బియ్యం కడిగిన ఒక కప్పు నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్కపొడిని వేసుకుని తాగినట్లయితే మహిళలను అధికంగా వేధించే బుతుస్రావ సమస్య ఇట్టే తగ్గిపోతుంది.
ఒకగ్లాస్ పాలలో చిటికెడు దాల్చిన చెక్కపొడిని వేసుకొని తాగినట్లయితే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.
దాల్చిన చెక్క కాషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి.
10గ్రాముల దాల్చినచెక్కపొడి, పావు టీ స్ఫూన్ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పి కూడా క్షణాల్లో మాయమవుతుంది.