health tips in telugu

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..? ఫైల్స్‌ వేధిస్తున్నాయా..?

మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి చల్లగా ఉంచుతుంది. రోజులో​ ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మజ్జిగ మన దాహార్తిని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియంను అందిస్తుంది.

మజ్జిగ గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బీపీ తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

మజ్జిగ శరీరంలో మెటాబాలిజం రేటును పెంచి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. కడుపులో ఏర్పడే అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వెన్నునొప్పితో బాధపడేవారు ప్రతిరోఉ ఒకగ్లాసు మజ్జిగలో ఒక స్పూన్‌ అల్లం రసం, చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకున్నట్లయితే బ్యాక్‌పెయిన్‌ సమస్య నుంచి త్వరగా బయటపడగలరు.

ఫైల్స్‌ వ్యాధితో బాధపడేవారికి మజ్జిగ ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో అర టీ స్పూన్‌ సొంఠి పొడని వేసి తీసుకున్నట్లయితే ఫైల్స్‌ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చును. క్రమం తప్పకుండా ఇలా ఒక నెలపాటు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button