మీకు తెలుసా.. బేకింగ్ సోడాను ఇలా కూడా వాడుకోవచ్చని..
చాలా కాలం నుంచి మనం బేకింగ్ సోడాను వంటల్లో వాడుతూ ఉన్నాం. అయితే బేకింగ్ సోడాను అందం మరియు ఆరోగ్యాన్ని ఇచ్చేదానిగా కూడా చెప్పవచ్చు. ఇది ఒక మంచి హోమ్ రెమిడీగా కూడా ఉపయోగించుకోవచ్చు.
బేకింగ్‌సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలతో బాధపడేవారికి బేకింగ్‌సోడా అమోఘంగా పనిచేస్తుంది. ఇది స్వేదరంధ్రాలను శుభ్రం చేసి చర్మకణాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఒక చిన్న టబ్ నీటిలో కొంచెం బేకింగ్ సోడాను వేసి అందులో అరికాళ్లను మునిగేటట్లుగా పెట్టుకుని సుమారు 15 నుంచి 20 నిమిషాలపాటు ఉంచుకోవడం ద్వారా కాళ్ల పగుళ్ల సమస్య తగ్గడమే కాకుండా మృదువైన పాదాలను పొందవచ్చు.
బేకింగ్ సోడాతో పళ్లను బ్రెష్‌చేయడం ద్వారా తెల్లటి, మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పళ్లపై ఏర్పడే గార, పసుపుపచ్చని సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఒక మంచి మౌత్ ఫ్రెష్‌నర్‌గా కూడా పనిచేస్తుంది.