తన ప్రేమని తారు రోడ్డుపై రాసి మరి తన విరహ వేదనను తెలిపాడు… ఫొటోస్ వైరల్…!

ఒక వ్యక్తి ఎవరినైనా ప్రేమిస్తే, మనసులో దాచుకోవడం తెలుసు, అలాగే ఒక కాగితం పై రాసి భద్రంగా దాచుకోవడం చూసాం, ఇంకా చెప్పాలంటే చెట్టు పై చెక్కడం, రాళ్ల పై చెక్కడం చూసాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా 3 కిలోమీటర్ల వరకు తన ప్రేమను తెలుపుతూ I LOVE YOU , ఇంకా I MISS YOU ని రాశాడు.
పాపం తనకి ఎంతటి బాధ వచ్చిందో తన రాతలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతని ప్రేమ విఫలమైన వ్యక్తిలా ఉన్నాడు. అందుకనే ఇలా తన ప్రేమను రోడ్డుపై రాసి మరీ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు.
కానీ, ఇలా చాల మంది యువత ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే ప్రేమించి, జీవితం మొదట్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కేవలం ఒక అమ్మాయికోసం తన తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని వదిలేసి వెళ్లిపోతున్నారు. వారికి ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమని, తాను ప్రేమించిన అమ్మాయే కాకుండా తనకు ఉన్న భవిష్యత్తును, బాధ్యతలను తెలుసుకోకుండా అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ప్రేమ విఫలమైన విరహా వేధనను ధారంగుట్టి వెళ్లే మార్గంలో ‘ఐ లవ్ యు’, ‘ఐ మిస్ యు’ అంటూ రోడ్డుపై 3 కిలోమీటర్ల మేర రాసి , అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. మొదటగా ఈ రాతలను కొల్లాపూర్ జిల్లా శిరోల్ తహసీల్‌కు చెందిన ధారంగుట్టి గ్రామస్థులు గుర్తించారు. ఇపుడు ఈ రాతలు షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కొల్లాపూర్ జిల్లా పోలీసులు ఈ రాతలు రాసిన వ్యక్తి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అని అతనిని పట్టుకొనే పనిలో పడ్డారు.