Tollywood news in telugu

తన ఆనందం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అంటున్న రామలక్ష్మి

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో, అందంతో అందరిని మాయ చేసిన అందాల భామ సమంత. సమంత, నాగచైతన్య ని వివాహం చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యిoది. అయినప్పటికీ తన సినీ కెరీర్ ని మాత్రం అలాగే కొనసాగిస్తూ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్‌ హిట్‌లతో ఈ ఏడాది ప్రథమార్దం సమంతకు బాగా కలిసి వచ్చింది. ఈ ఇయర్ ద్వితీయార్దంలో కూడా మంచి మూవీస్ తో మన ముందుకు రాబోతుంది ఈ అక్కినేని కోడలు. కొందరు నిర్మాతలతో కలిసి సామ్ స్వయంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నడ హిట్‌ మూవీ u turn అనే సినిమాను అదే పేరుతో తెలుగులో సమంత రీమేక్‌ చేస్తుoది. సామ్ స్వయంగా ఈ చిత్రంలో నటించి, నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో నటించగా, ఇతర ముఖ్య పాత్రల్లో భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లతోనే ఈ చిత్రం మంచి బజ్ సృష్టించుకుంది. దీనితో పాటు u turn ప్రమోషన్స్ లో భాగంగా కర్మ థీమ్ సాంగ్ ఒక ప్రైవేటు వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ u turn వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా సమంత అక్కినేని మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమంతా అద్భుతమైన సమాధానం ఇచ్చారు.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

ఇప్పటివరకు నాగ చైతన్య, సమంతా సిల్వర్ స్క్రీన్ పై ఒకేసారి కనిపించి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అయితే పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారో అని ఎదురు చూసే ప్రేక్షకులకి మాత్రం ఇప్పుడు వీరిద్దరూ విడివిడిగా నటించిన సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి.  శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో నాగచైతన్య కూడా సెప్టెంబర్ 13 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

చైతు మూవీ మరియు నా మూవీ ఒకే తేదీలో విడుదల అవుతుంటే లోపల చిన్న టెన్షన్ అయితే ఉంది. అసలు చైతు సినిమాతో పాటు, మా సినిమా కూడా రిలీజ్ చెయ్యాలని మేమెప్పుడూ ప్లాన్ చెయ్యలేదు. కానీ యూ టర్న్ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదలవుతున్న కారణంగా, మేం విడుదల తేదీని మార్చడం కుదరలేదు. మా ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా అయితే, చైతు హ్యాపీనెస్ కి మించి నాకు ఏది ఎక్కువ కాదు. అని సమంతా సమాధానమిచ్చారు. దీనితో సమంతాకి చైతు అంటే ఎంత ప్రేమో అర్ధమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button