ఆ నిర్మాతలను చంపెయాలి
రజనీకాంత్ సినిమా కు థియేటర్స్ ఇవ్వక పోవడం మీద స్పందించిన శ్రీరెడ్డి.
తెలుగులో ఈసారి సంక్రాంతి బరిలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పేటా కూడా ఉంది.అయితే ఈ సినిమాకు తెలుగు అగ్రనిర్మాతలు ఒక నలుగురు థియేటర్ లు దొరక్కుండా బ్లాక్ చేశారని మొన్నీమధ్య ఈ సినిమా నిర్మాత అశోక్ వల్లభనేని వాపోయారు ప్రెస్ మీట్ లో . . .
ఈ విషయం మీద వివాదాస్పదంగా కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు. సూపర్ స్టార్ సినిమాకు థియేటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం అని, సునీల్ నారఁగు, సురేష్ బాబు , దిల్ రాజు , అల్లు అరవింద్ లాంటి వారివల్ల ఈ సినిమా కొన్న చిన్న నిర్మాతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని బాధ పడ్డారు. భాదితుల కుటుంబం లాగే ఈ నిర్మాతల కుటుంబాలు భాదపడే రోజు వస్తుందని తెలిపారు.వీళ్ళను చంపేయాలి.వీళ్ళ సినిమాలు తమిళ్ నాడులో రిలీజ్ కాకుండా చూడాలని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కామెంట్ లు దుమ్ము రేపుతున్నాయి.