Hatrick time for a Hit Combination : ముచ్చటగా మూడోసారి కలిసిన హిట్ కాంబినేషన్ :-

Hatrick time for a Hit Combination : సందీప్ కిషన్ ఈ పేరు కి ఇంట్రో అవసరం లేదు. తన విభిన్న నటనతో మరియు డిఫరెంట్ స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తారు. అలాంటి సందీప్ కిషన్ మొదటి సినిమా వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ తో ఎంత ఫేమస్ అయ్యారో , దాని తర్వాత అంత పెద్ద హిట్ అందుకున్న సినిమా టైగర్.
ఈ సినిమాలో సందీప్ కిషన్ నటనకు ఫాన్స్ ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేసారు. ఈ చిత్రాన్ని దర్శకత్వం వి.ఐ. ఆనంద్ వచించారు. అయితే వి.ఐ. ఆనంద్ గారి సినిమాలు ఎప్పుడు చాల స్పెషల్ మరియు విభిన్న కథనాలతో నడుస్తాయి. విభిన్న కధలకు పెట్టింది పేరు వి.ఐ.ఆనంద్ సినిమాలు.
ఇదిలా ఉండగా సందీప్ కిషన్ వి.ఐ. ఆనంద్ రెండవసారి కలిసి నిన్ను వీడని నీడను నేనే అనే డిఫరెంట్ హారర్ సినిమా తీసి మరల హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు.
అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ హిట్ కాంబినేషన్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక పూజ కార్యక్రమాలు జరిగాయి.
ఈ సినిమా కి క్లాప్ అల్లరి నరేష్ కొట్టారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈసారి ఈ హిట్ కాంబినేషన్ ఎలాంటి కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారో.