Tollywood news in telugu

harihara veeramallu teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” టీజర్ విడుదల…!

harihara veeramallu teaser

harihara veeramallu teaser : మహాశివరాత్రి సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు”  మూవీ నుండి ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు. ఈ సినిమా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది  పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి పలు వార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. మొన్నటివరకు  ‘’విరూపాక్ష’’, ‘’హరిహర వీరమల్లు’’ అనే టైటిల్స్ లో యూనిట్ సభ్యులు ఏది నిర్ణయించుకోలేదు , ఇపుడు సడెన్ గా “హరిహర వీరమల్లు” అంటూ శివరాత్రి పండగ సందర్బంగా చిన్నపాటి టీజర్ ని విడుదల చేసారు.

ఈ చిన్న టీజర్ లో మొదటగా  పవన్ డ్రెస్ కి ఉన్న గద్ద సింబల్ ని చూపిస్తూ.. నెమ్మదిగా కత్తి.. అతడి చేతికి ఉన్న కడియంని స్లో మోషన్ లో చూపించారు. ఆ తరువాత చురకత్తులాంటి పవన్ కళ్యాణ్ కళ్లని హైలైట్ చేసారు. గజదొంగ డ్రెస్ లో పవన్ షిప్ మీదకి ఎగిరే సన్నివేశం మొత్తానికి బాహుబలి మూవీలో ప్రభాస్ లా చూపించారు. ఇందులో  కీరవాణి అందించిన నేపధ్య సంగీతం ఈ ఫస్ట్ లుక్ ని ఆకట్టుకొనేలా చేస్తుంది.

ఈ చిన్న క్లిప్ చూసాకా పవన్ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. అదేవిదంగా  సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.  ఇది పవన్ అభిమానులకు మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ నే ఈ రేంజ్ లో చూపించారంటే ఇక టీజర్, ట్రైలర్ సమయంలో హడావిడి మాములుగా ఉండదని అనిపిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ‘నిధి అగర్వాల్’  హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ సరసన కనపడనుంది . మరొక ముఖ్యమైన రోల్ లో  జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించనుందని వార్తలు వినపడుతున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button