Hanuma Vihari: “బిహారి కాదు విహారి” అంటూ కేంద్రమంత్రికి ఝలక్ ఇచ్చిన టీం ఇండియా క్రికెటర్

Hanuma Vihari : సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా హోరాహోరీగా పోరాడింది. ఆ టెస్ట్ మ్యాచ్ ను చూస్తే మరో యుద్ధాన్ని తలపించేలా ఉంది. ఐపీఎల్ కి మించిన మజా ఆ 3వ టెస్ట్ లో దొరికిందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు.

మరి ఆ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగడానికి కారణం టీమిండియా క్రికెటర్లే ..ముఖ్యంగా హనుమా విహారి లెగ్ పెయిన్ తో బాధపడుతున్న.. అశ్విన్ తో కలిసి 259 బంతులను ఎదుర్కొన్నాడు. 3వ టెస్ట్ ను డ్రా కావడానికి హనుమ విహారే చాలా పోరాడాడు.
అయితే విహారి బంతులు ఎక్కువ ఆడి..స్కోర్ తక్కువ చేయడంతో… విహారి స్ట్రైక్ రేటు తక్కువగా ఉంది. దీనిపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తీవ్రంగా స్పందించారు. విహారి 109 బంతుల్లో 7 పరుగులే చేయడం దారుణమని… భారత్ కి విజయాన్ని అందించే అవకాశాలు మెండుగా ఉన్నా విహారి ప్రయత్నించకపోవడం నేరమని కేంద్ర మంత్రి బాబుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

దీంతో కేంద్ర మంత్రి ట్వీట్ పై విహారి స్పందించారు. క్రికెట్ అభిమానులు అలాంటి వాక్యాలను పట్టించుకోవద్దని విహారి సూచించారు. అలాగే కేంద్ర మంత్రి పెట్టిన ట్వీట్ లో విహారి కి బదులు బిహారి అన్ని పెట్టడంతో… తన పేరు బిహారి కాదు… హనుమా విహారి అంటూ విహారి కేంద్ర మంత్రికి ఝలక్ ఇచ్చాడు