Tollywood news in telugu

తుపాకీ పట్టి శత్రువు తో పోరాడేందుకు సిద్ధమైన ప్రధాని భార్య – ఇది ఎక్కడో తెలుసా ?

హకోబ్యాన్
credit photo : instagram

హకోబ్యాన్ గత కొన్ని సంవత్సరాల నుండి అజర్‌బైజాన్, అర్మేనియా అనే ఇరు దేశాలు నాగోర్నో- కరాబాఖ్ అనే ప్రాంతం పై ఆదిపత్యం కోసం పోరు సాగిస్తున్నారు. ఈ పోరులో వేల మంది సైనికులు అమరులయిన, ఈ పోరు కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అర్మేనియా ప్రధాన మంత్రి నికోల్ పషిన్యన్ … దేశ ప్రజలందరూ దేశ భూభాగన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో ప్రధాని పషిన్యన్ భార్య అయిన హకోబ్యాన్ మిలటరీ లో జాయిన్ అవ్వబోతున్నాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆమె 13 మందితో కూడిన మిలిటరీ స్క్వాడ్ లో కలిసి శిక్షణ తీసుకుంటున్నారు. హకోబ్యాన్ జర్నలిస్టులగా పలు మీడియా చానల్లో పని చేశారు. ప్రస్తుతం అయితే ప్రఖ్యాతి గాంచిన ఆర్మేనియన్ టైమ్స్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఈ సందర్భంగా హకోబ్యాన్ మాట్లాడుతూ… దేశ ఆత్మగౌరవానికి, దేశం భూభాగం కోసం ఆర్మేనియా ప్రజలు సైన్యంలో చేరి, మాతృభూమికి సేవలు అందించాలన్నారు. దేశం పట్ల హకోబ్యాన్ ఉన్న తెగువ, ధైర్యం చూసి పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button