movie reviews

జిప్సీ ఫుల్ స్టోరీ ఆండ్ రేవ్యూ

సినిమా :- జిప్సీ(2020)నటీనటులు :- జీవా , నటాషా సింగ్.మ్యూజిక్ డైరెక్టర్:- సంతోష్ నారాయణ్, సుశీల రామన్ నిర్మాతలు :- అంబెత్ కుమార్ డైరెక్టర్ :- రాజు మురుగన్ 

కథ:- ఈ కథ కులాల వల్ల మతాల వల్ల యుద్దాలు జరిగి వినాశనానికి దారి తీసిన రోజుల నుంచి ప్రారంభం అయింది.హీరో పేరు జిప్సీ.ఆకాలంలో హీరో సంవత్సరం బాబు.జిప్సీ అతని అమ్మానాన్నది మతాంతర వివాహం. కుల మత కల్లోలాలు జరిగే ప్రదేశంలో వీరుంటారు. అలా ఆ గొడవలు జరిగే ప్రదేశంలో అనుకోకుండా జిప్సీ అమ్మానాన్న చనిపోతారు. అదేసమయంలో జిప్సీని ఒక సింగర్ మరియు మ్యుజీషన్ పేరు సీనియర్ పెంచి పెద్ద చేస్తాడు. వీరిద్దరూ ప్రపంచంలో ఉన్న ఊర్లన్నీ తమ వద్దనున్న గుర్రం సాయంతో తిరిగేవారు. ఒకరోజు రాత్రి సీనియర్ జిప్సీకి ఈ ప్రపంచంలో నీకంటూ ఒక తోడు ఉండాలి. మనం జీవితంలో ఏం చేసినా మనకంటూ ప్రేమించడానికి ఒకరు ఉండాలి అదే జీవితం. మనం చనిపోయినా మన కోసం ఏడ్చేవారు ఉన్నపుడే మన జీవితం సుఖమయం అవుతుంది అని చెప్తాడు. అలా జిప్సీకి ఆ మాట చెప్పిన మరుసటి రోజే సీనియర్ చనిపోతాడు.


సీనియర్ చావుతో జీవితంపై నిరాశ చెందిన జిప్సీ తన గుర్రాన్ని వెంటేసుకొని ఊరూరూ తిరుగుతాడు. జిప్సీ గుర్రంతో నాట్యం చేయించడంలో మరియు గిటార్ వాయిస్తూ పాట పాడటంలో స్పెషలిస్ట్. అలా గుర్రంతో నాట్యం ఆడిస్తున్న సమయంలో వహీదాని చూసి ప్రేమలో పడతాడు. వహీదా ముస్లిం అమ్మాయి. జిప్సీ మరియు వహీదా మాట్లాడుకోకుండానే కళ్ళతో ప్రేమించుకునేవారు కానీ ఒకరికొకరు వారి ప్రేమను చెప్పుకోలేదు.అనుకోకుండా ఒకరోజు వహీదాకి పెళ్ళి చేసేయ్యాలి అని నిర్ణయించుకొని వహీదాకి తెలియకుండానే ఎంగేజ్మెంట్ చేసేస్తారు. అది తట్టుకోలేక వహీదా , జిప్సీతో పారిపోతుంది.

అలా ఇద్దరు పెళ్లి చేసుకొని సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్న సమయంలో జిప్సీ ఉన్న ప్రదేశంలో రాజకీయ దాడులు కొట్లాటలు జరుగుతాయి. అసలే వహీదా  నెల్లలు నిండిన గర్భవతి. ఆ రాజకీయాల దాడుల్లో జిప్సీ ఉన్న ప్రదేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. జిప్సీ ప్రాణానికి ప్రాణమైన గుర్రాన్ని కూడా తగలబెట్టేస్తారు. సుమారు 1400 మంది పైగా చనిపోతారు. ఆ దాడుల్లో జిప్సీ మరియు వహీదా వేరే వేరే దారుల్లోకి వెళ్లి ఇరుక్కుపోతారు. జిప్సీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వహీదాకి ఎటు వెళ్ళాలో తెలియదు.ఉన్నట్టుండి నొప్పులు రావడం మొదలవుతాయి. ఒక పాప పుడుతుంది. జిప్సీకి కోర్ట్ వారు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. ఓ పత్రిక వారు తీసిన ఫోటీలో వహీదా ఫోటో ఉండటంతో దేశం అంతా వహీదా పేరు మారుమ్రోగిపోతుంది. ఆ కులాంతర గొడవల్లో బ్రతికి ఉన్న ఏకైక సాక్ష్యం వహిదానే కాబట్టి అన్ని పత్రికల వారు వహీదా కోసం వెతుకుతూ ఉంటారు.


విశ్రాంతి..


ఆ యదార్థ సంఘటనని వహీదా మర్చిపోలేకపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే వహీదా మెంటల్ కండిషన్ బాలేదు. బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. కళ్ళు మూసినా తెరిచినా వహీదాకి ఆ సంఘటనే గుర్తుకు వచ్చేది. తనని చంపడానికి వచ్చిన వ్యక్తిని వేడుకునట్లు బాధపడుతున్నట్లు ఉండేది. వహీదా ఎక్కడుందో పత్రికల ద్వారా తెలుసుకున్న వహీదా నాన్న వహీదాని ఇంటికి తీసుకుని వెళ్తాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత జైలు శిక్ష ముగించుకొని వచ్చిన జిప్సీని వహిదా గుర్తుపట్టలేకపోతుంది. జిప్సీని చూస్తే భయపడేది. జిప్సీ వహీదాని తనతో పాటు తీసుకొని వెళ్లిపోవాలని చాలా ప్రయత్నిస్తాడు కానీ అది జరగదు.

ఇంకోపక్కేమో వహీదా ఆలా అయిపోవడానికి కారణం జిప్సీనే అని అతనితో వహీదా విడాకులు తీసుకోవాలని సంఘం అధ్యక్షులకు విన్నవించుకుంటాడు వహీదా తండ్రి. ఎలాగో వహీదా కండిషన్ బాలేదు కాబట్టి ముస్లిమ్స్ ఆచారం ప్రకారం 3 సార్లు భార్యకి విడాకులు ఇస్తున్నట్లు సంఘం అధ్యక్షుల ముందు తల ఆడించాలి. అలా 2 సార్లు అయిపోతాయి. ఇంకా 3వ సారి కూడా తల ఆడించేస్తే ఇద్దరు విడిపోయినట్లే అని పెద్దలు చెప్తారు.జిప్సీ ఎలాగైనా తన వహీదాని సొంతం చేసుకోవాలని సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పత్రికలో ముద్రించిన వ్యక్తి ( వాహిదా, చంపకుండా వదిలేయండి అని వేడుకున్న మనిషిని )ని జిప్సీ వెంటాడి తన పరిస్థితి చూసి బాధపడి వహీదా గురించి చెప్తాడు. ఆ మనిషి నా వలన ఇంతమంది జీవితాలకు అన్యాయం జరిగింది. అది నేనే సరిదిద్దాలి అని చెప్తాడు. జిప్సీ ఒక మ్యూజిక్ క్యాసెట్ పెట్టి వహిదాకి గతం అంతా గుర్తుకువచ్చేలా చేస్తాడు. ఆ మనిషిని చూసి భయపడే వహీదా భయం జిప్సీ పోగోట్టేస్తాడు. ఇలా జిప్సీ మరియు వహీదా ఒక్కటవుతారు. 


👍* కథ పరంగా కొత్తదనాన్ని చూపెట్టడానికి ప్రయత్నించారు.  *  నటన పరంగా జీవా అందరినీ మెప్పించాడు. జిప్సీ మరియు వహీదా మధ్య కెమిస్ట్రీ చక్కగా చూపించారు. * కెమెరా వర్క్ చాలా బాగుంది.* పాటలు వినసొంపుగా ఉన్నాయి. పాటల చిత్రీకరణ కూడా చాలా బాగా చేశారు. * నిర్మాణ విలువలు బాగున్నాయి. 


👎* రెండవ భాగంలో దర్శకుడు విఫలం అయ్యాడు అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేక పోయారు. * సినిమా అంతా స్లోగా సాగుతుంది. 
ముగింపు :-జిప్సీ సినిమా ఒకసారి చూడవచ్చు. కథపరంగా కొత్తదనాన్ని చూపించాలి అనుకున్నారు కానీ రెండవ భాగంలో అది జరగలేదు సరి కదా నిరాశనే మిగిల్చింది. స్లోగా సాగే చిత్రం. పాటలు వినడానికి మరియు వాటి చిత్రీకరణ చూడటానికి ఎంతో బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. నటన పరంగా జీవా ఎప్పటిలాగా మెప్పించాడు. జిప్సీ మరియు వహీదాల ప్రేమ సన్నివేశాలు చూడటానికి చాలా బాగున్నాయి. మొత్తం మీద జిప్సీ చిత్రం ప్రేక్షకులని పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ :- 2/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button