Tollywood news in telugu

బాలకృష్ణుడికి దొరకని గోపికలు !

సీనియర్ నటుడు బాలకృష్ణ పరిస్థితి గోపికల విషయంలో అదేనండి హీరోయిన్ లు దొరకడం లేదు. సీనియర్ హీరోలు అందరిదీ  ఇదే పరిస్థితి.

 కానీ మిగిలిన వారికి బడ్జెట్ రీత్యానో, క్రేజ్ రీత్యానో ఎవరో ఒకరు సెట్ అవుతున్నారు. కానీ బాలయ్య పరిస్థితి మాత్రం అలా కాదు.

ఎవరిని అడిగినా చేయమని చెబుతున్నారట. ఆఖరికి ఆ మధ్యన ఓ సినిమా చేసిన అంజలిని అడిగాన చేయనని తెగేసి చెప్పిందట.

మొత్తానికి బాలయ్య కోసం దర్శకుడు బోయపాటి ఓ మలయాళీ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ను తీసుకువచ్చారు. ఈ విషయం ఆ మధ్య వార్తల్లోకి వచ్చింది. 

ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఓ చిన్న హీరోయిన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లరి రవిబాబు తో ఒకటి రెండు సినిమాలు చేసి, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక, ఢీ లాంటి టీవీ షో లు చేస్తున్న పూర్ణ ను తీసుకున్నారట.

 పూర్ణ రెమ్యూనిరేషన్ మహా అయితే పది లక్షలకు అటు ఇటు వుంటుందని టాక్ వుంది. అల్లరి నరేష్, అల్లరి రవిబాబు లాంటి వారి పక్కన చిన్న సినిమాలు చేసిన పూర్ణ ఇప్పుడు ఇన్నేళ్ల గ్యాప్ తరువాత బాలయ్య పక్కన చేయడం వల్ల పూర్ణ కు కలిసి వస్తుందో చూడాలి .

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button