Seetimaar Teaser: కబడ్డీ..కబడ్డీ మైదానంలో ఆడితే ఆట…..బయట ఆడితే వేట….అంటూ గోపీచంద్ ఇరగదీసాడు…!

Gopichand Seetimaar Teaser: గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్ లుగా వస్తున్న సినిమా ‘సీటీమార్’, దీనిని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో నిర్మిస్తున్నారు. ఇందులో కబడ్డీ కోచ్‌లుగా తమన్నా, గోపీచంద్ లు కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తున్నంతసేపు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పక్కా కమర్షియల్ అంశాలు ఉన్నాయ్. చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చాల రోజుల తరువాత గోపిచంద్‌కు మరో హిట్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇందులో ‘కబడ్డీ..కబడ్డీ మైదానంలో ఆడితే ఆట..బయట ఆడితే వేట.. ‘అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ అందరిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా, బాణీలను మణిరత్నం సమకూర్చుతున్నారు.