telugu cinema reviews in telugu language

Gopi Chand Seeti Maar Movie Review | సీటీ మార్

 Seeti Maar Movie
Seeti Maar

Movie Review: Seeti Maar

Cast & Crew: గోపీచంద్, తమన్నా, ప్రీతి అశ్రని మొదలగు వారు

Producer –  శ్రీనివాస చిత్తురి

Music Director – మని శర్మ

Director – సంపత్ నంది

Release Date – 10th Sept 2021

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో గోపీచంద్ నటించిన సీటీమార్ ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే సీటీమార్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Story:-

ఈ కథ కార్తీక్ ( Gopichand ) ని అసిస్టెంట్ బ్యాంకు మ్యానేజర్ గా చూపిస్తూ మొదలవుతుంది. దానితోపాటు కార్తీక్ ఆంధ్ర ప్రదేశ్ మహిళల కబడ్డీ జట్టుకు కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన కబడ్డీ జట్టును జాతీయ పోటీల కోసం ఢిల్లీ తీసుకొని వెళ్తాడు. కానీ అదే సమయం లో కార్తీక్ కుటుంబ సభ్యులలో ఒకరికారణంగా మొత్తం కబడ్డీ టీం ని కిడ్నప్ చేస్తారు. ఇంతకీ ఎవరు కిడ్నప్ చేసారు? కార్తీక్ కుటుంబ సభ్యులలో ఎవరి కారణం చేత ఇలా జరిగింది? కార్తీక్ ఎలా టీం ని కిడ్నపేర్స్ నుంచి విడిపిస్తాడు ? వీటన్నిటి మధ్య జ్వాలా రెడ్డి (thamannaah ) పాత్ర ఏంటి ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

👍 :-

  • గోపీచంద్ తనదైన స్టీల్ లో మాస్ మరియు క్లాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తడు. తమన్నా కూడా తెలంగాణ కబడ్డీ కోచ్ గా బాగా చేసింది. మిగితా నటీనటులు కూడా వారి వారి పరిధిలో బాగా చేశారు.
  • కథ మరియు కథనం
  • ఫస్ట్ హాఫ్ , ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్.
  • మ్యూజిక్ చాలా బాగుంది.
  • దర్శకత్వం మరియు యాక్షన్ సన్నివేశాలు.
  • ఎడిటింగ్ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎 :-

  • కొన్ని సనివేశాలకు లాజిక్స్ ఉండవు. లాజికల్ గా చూస్తే బాగోదు.
  • సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువ ఉంది.

ముగింపు :-

మొత్తానికి Seeti Maar అనే సినిమా మాస్ ఆడియెన్స్ కి చాలా బాగా అలరిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా తో యాక్షన్ సన్నివేశాలే ఎక్కువ ఉండేలా చూసుకొని చాలా బాగా తీశారు సంపత్ నంది. గోపీచంద్ , తమన్నా కోచ్ గా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో బోర్ సన్నివేశాలు కొన్ని ఉంటాయి. లాజికల్ గా చూడకూడదు. మొత్తానికి లాజికల్ గా ఆలోచించకుండా సినిమా చూస్తే ఒక మంచి యాక్షన్ స్పోర్ట్స్ సినిమా చూస్తారు. ఈ వారం కుటుంబం అంతా కలిసి సరదాగా ఓసారి చుడేయచు.

Rating :- 2.75 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button