ఉదయాన్నే పాటించాల్సిన కొన్ని మంచి అలవాట్లు.. తప్పక తెలుసుకోండి
ఉదయం ఆహ్లాదంగా నిద్రలేస్తే ఆ ప్రభావరం రోజంతా ఉంటుంది. కొంతమందికి ఉదయాన్నే నిద్రలేవాలంటే చాలా బద్దకంగా అనిపిస్తుంటుంది. అయితే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేచి, రాత్రి ఒకే సమయానికి పడుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరం అని నిపుణులు అంటున్నారు.
ఉదయం లేవగానే తలుపులు, కిటికీలు తెరిచేసి సూర్యరశ్మి తాకేలా చూసుకోవడం మంచిది. ఉదయపు ఎండ శరీరానికి మేలు చేస్తుంది. దీనివలన డి విటమిన్ తయారవుతుంది.
ఉదయంపూట నిద్రలేవగానే మంచం మీద నుంచి ఒక్కసారిగా లేవడం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తే ఒక్కసారిగా రక్తం కాళ్లలోకి వచ్చేసి హఠాత్తుగా బీపీ తగ్గవచ్చు.

వ్యాయామం చేసే అలవాటు ఉంటే ఉదయాన్నే చేయడం మంచిది. వ్యాయామంతో గుండెకు మేలు కలుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
ఉదయాన్నే లేవగానే కాఫీ, లేదా వాటర్ కలిపి నిమ్మరసం తాగేవారు వెంటనే బ్రష్ చేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పల్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది.
ప్రతి ఉదయం మనకు ఒక కొత్తరోజును కానుకగా తెస్తుంది. నిద్రలేవగానే ఏదో ఒకపని చేయకుండా ఏ పనులకు ప్రాధాన్యతను ఇవ్వాలి అని ఉదయాన్నే నిర్ణయించుకోవాలి. అప్పడే రోజంతటిని సవ్యంగా వినియోగించుకోగలుగుతాం.