Good food for Brain : బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే ఏం తినాలి?
Good food for Brain : మన మూడ్ బాగుండాలంటే పసుపు కుంకుమ పువ్వు డార్క్ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలి. ఈ విషయాన్ని హార్వార్డ్ యూనివర్సిటీ మెడికల్ ప్రొఫెసర్ ఉమా నాయుడు తెలియజేశారు. ఈమె న్యూట్రస్ట్ కావడంతో మెదడుకు పేగులకు దగ్గరి సంబంధం ఉంటుందని తెలిపారు. ఇవి రెండు పరస్పరం రసాయన సందేశంతో మాట్లాడుకుంటూ ఉంటాయి. బ్రెయిన్లో సెరిటోనీన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇదొక న్యూరాన్ ట్రాన్స్మిటర్.. మనం హ్యాపీగా ఫీలవుతున్నామంటే దానికి కారణం ఈ హార్మోన్ వల్లనే.. దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ సెరిటోనీన్ ఉండాల్సిన స్థాయిలో ఉంటే హ్యాపీగా ఉంటారు లేకుంటే చిరాకు ఆవేశం బాధ డిప్రెషన్ వంటికి వాటికి గురవుతారు. అలాగే ఆకలి లేకపోవడం నిద్ర రాకపోవడం తిండి జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

వాస్తవానికి ఈ సెరిటోనీన్ 90-95% పేగులలోనే ఉత్పత్తి అవుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారు వెల్లడించారు. దీంతో ఆహారంపై ఎంతఎక్కువ పెడితే అంత మంచిది. మెదడు చురుగ్గా పనిచేయడానికి మూడ్ హ్యాపీ గా ఉండడానికి ఉమా నాయుడు పలు ఆహార పదార్థాలను సూచించారు.
1. పసుపు
2.కుంకుమపువ్వు
3.పులుగు పెట్టిన ఆహారాలు ఉదాహరణకు పెరుగు
4.డ్రై ఫ్రూట్స్
5.డార్క్ చాక్లెట్స్
6.అవకాడో