గుండెలని పిండేస్తున్న “పెనివిటి”
ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న “aravinda sametha veera raghava” సినిమాలోని ఒక్కొక్క సింగల్ ని లిరికల్ వీడియో రూపంలో ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సింగల్ అనగనగా అంటూ ఒక రొమాంటిక్ ట్రాక్ ని వదిలాడు. నిన్న సాయంత్రం సెకండ్ సింగిల్ పెనివిటి అంటూ సెంటిమెంట్ తో ఎక్కువగా మహిళా ప్రేక్షకుల గుండెల్ని పిండేసేలా ఉన్న ఈ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. “పెనివిటి” అంటూ సాగిపోతున్న ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కీరవాణి గారి అబ్బాయి కాల భైరవ ఈ పాటని పాడారు. “పెనివిటి” రాక కోసం ఎదురు చూస్తున్న ఒక ఇల్లాలి బాధ, ఆర్తిని తెలుపుతున్న ఈ పాట కన్నీళ్లు పెట్టిస్తోంది. లిరిక్స్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా ఈ పాట పదికాలాలపాటు గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘aravinda sametha veera raghava” చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్‌లైన్. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వరుస హిట్స్ తో ఎన్టీఆర్ మంచి దూకుడు మీద ఉండటంతో ‘అరవింద సమేత’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సృష్టించిన విధ్వంసం గురించి అందరికి తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు తుది దశ పనులు పూర్తి చేసుకుంటుంది. అక్టోబర్ 11 న విడుదలకానున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా, నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. జగపతిబాబు నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈaravinda sametha veera raghava సినిమాలో పూజా హెగ్డే మరియు ఇషా రెబ్బా ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.