News

Gollapalli incident : మనిషి కోడిని బలివ్వడం చూసాం… కానీ ఇక్కడ ఒక కోడి , మనిషిని బలిచ్చింది ….ఈ కారణంగా కోడి అరెస్ట్ కూడా అయింది …!

Gollapalli  incident

కోడి పందేల సరదా ఒక మనిషి ప్రాణంని బలిగొన్నది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో కోడిని పెంచిన వ్యక్తే మరణించాడు.  వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారు  స్థానికులు . 

దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంతమంది  కోళ్లు తీసుకుని పందెం లో  పాల్గొనేందుకు పోటీ పడ్డారు. అందరిలాగే  వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన ‘తనుగుల సతీష్ ‘ కూడా తన కోడిని తీసుకొని అక్కడికి వెళ్ళాడు.

కోడి పందేలు చూడటానికి బారి సంఖ్యలో జనం హాజరయ్యారు.  ఈ క్రమంలోనే సతీష్ తన కోడిని బరిలోకి దించేందుకు కోడి కాలికి కత్తిని కట్టి బరిలో దించేందుకు ప్రయత్నిచే సమయంలో, జనాల అరుపులకు బెదిరిన కోడి సతీష్ తన కోడిని రెండుకాళ్ళ మధ్య లో ఉండటంతో, తన మర్మాంగాలకు కోడికి కట్టిన కట్టి తగలడంతో తీవ్రస్థాయిలో రక్తస్రావం జరిగి హాస్పిటల్  కి తీసుకెళ్లే సమయంలో  సతీష్ చనిపోయాడు. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సతీష్ చనిపోవడానికి కారణం ఒక కోడి పుంజు అని తేల్చి ఆ కోడిని ఏ1 ముద్దాయిగా అరెస్ట్ చేశారు. మనిషి ప్రాణం బలిగొన్న కోడిని అరెస్ట్ చేసారు బాగానే ఉంది . కానీ పోలీసులు ఆ కోడికి ఎలాంటి శిక్ష వేయనున్నారా వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button