Today Telugu News Updates
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ బంగారం !

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.2 కిలోల బంగారు కడ్డీలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి రియాద్ నుంచి వచ్చిన పోలీసులు గుర్తించారు. బంగారం విలువ దాదాపు రూ. 66.82 లక్షలు ఉంటుందని అంచనా, పక్కా సమాచారం మేరకు సౌదీ అరేబియా నుండి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు తెలిపారు.