News

gold rate today :బంగారం ధర తగ్గుతుందని కొంటున్నారా….తొందర పడకండి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది…!

gold rate today

gold rate today : రోజురోజుకు బంగారం ధరలు పతనమౌతున్నాయి.  దీంతో బంగారం షాపులు కిక్కిరిసి పోతున్నాయి. కానీ తొందరపడి ఇప్పుడే కొనకండి ఎందుకంటే ధరలు ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి మరికొన్నిరోజులు ఆగడం  మంచిది అంటున్నారు.

ఈ రోజు మార్చి 5న బంగారం ధర బేర్ మార్కెట్‌‌ టెరిటరీలోకి ఎంటర్ అయ్యిందని నిపుణులు అంటున్నారు. దీనికి గల కారణం  అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం .  డాలర్ బలపడటంతో  బంగారం ధర నెలకి పడిపోతుంది. ఫలితంగా  బంగారంపై అమ్మకాల ఒత్తిడి నెలకొందని నిపుణుల మాట .

అదేవిదంగా గ్లోబల్ ఎకానమీ వృద్ధి అంచనాలు సానుకూలముగా ఉండటం.   మార్కెట్ లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వలన  ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన పెట్టుబడులను తిరిగి వెనక్కి తీసుకొని, ఎక్కువ లాభాలు  అందించే వాటిలో పెట్టడం వలన బారి స్థాయిలో  బంగారం ధరలు పడిపోతూనే ఉంటున్నాయి.

మార్కెట్ లో పసిడి వాల్యూ  గత ఏడాది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుండి  20 శాతం వరకు పడిపోయింది. ఈ కారణంగా  గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఒత్తిడి ఏర్పడింది. బంగారాన్ని నమ్ముకున్న  ఇన్వెస్టర్లు వారి వారి డబ్బులు వెనక్కి తీసుకోవడం , ఈ కారణంగా పసిడి ధరలు అందరికి అందుబాటులోకి రావడంతో ప్రజలు విపరీతంగా బంగారాన్ని కొంటున్నారు. ఇక ఇప్పుడు తీసుకుంటే ముందు రోజుల్లో జరిగే శుభకార్యాలకు ఉపయోగ పడుతుందని వారి ఆలోచన.

మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు  రూ.43,500 నుంచి రూ.44,000 వేల వరకు వచ్చి  స్థిర పడొచ్చని నిపుణులు అంటున్నారు. అదేవిదంగా  పసిడి రేటు రూ.43,500 స్థాయి నుండి ఇంకా తగ్గితే  మాత్రం.. రేటు రూ.41,500 లేదా రూ.42,000 స్థాయికి చేరుకుంటుందని  అంచనా వేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button