Gold Mountain : ఆ ఊరిలో బయట పడ్డ బంగారి కొండ… తెలిసిన మరుక్షణమే ఊరంతా కాళీ… !

Gold Mountain : బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు…చిన్న పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతీ ఒక్కరికి బంగారం అంటే మోజె .. ఉంటుంది. రూపాయి రూపాయి దాచి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు మగువలు. ఏ చిన్న సందర్భం వచ్చినా నగలు తగిలేసుకొని మరి ఫంక్షన్ లకు వెళ్తారు. అలాగే బంగారంతో చేసిన చిన్న చిన్న వస్తువులను బహుమతులుగా తీసుకెళ్తూ ఉంటారు.
మరి ఇంత విలువైన బంగారం ఫ్రీగా దొరుకుతుందంటే… ఏమైనా ఉందా ఎగిరి గంతేస్తారు మహిళలు. అదే …బంగారి కొండే కనపడితే .. ఇంకా ఎలా ఉంటదో ఆలోచించండి. తట్ట, బుట్ట, పారా తీసుకొని వారి బంధువులను తీసుకొని మరి ఆ కొండని బద్దలు కొట్టి అక్కడున్న బంగారాన్ని మాయంచేస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో’.
అక్కడ ఒక కొండా అంతటా 60 నుండి 90 శాతం వరకు బంగారమే ఉందని ప్రజలు తెలవడంతో ఆ ఊరి ప్రజలందరూ మొత్తం వచ్చి కొండపై చేరి తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడ తవ్వినాకొద్దీ బంగారి నిక్షేపాలు బయటపడుతుండటంతో ఊరు ఊరంతా కాళీ అయి కొండప్రాంతానికి పారా,పలుగు , సంచులు తీసుకొని బయలుదేరారు.
దొరికినోనికి దొరికినంత అక్కడ ఉన్న ప్రతీ రాయిని సంచులలో వేసుకుంటే , మరికొందరు మట్టి తవ్వి అక్కడే కడిగి మట్టిలోనుండి బంగారాన్ని మాత్రమే సంచులలో నింపుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ఆ కొండపై బంగారాన్ని తవ్వుకోవడానికి ఎవ్వరూ వెళ్లకూడదని ఆంక్షలు జారీ చేసింది. ఇపుడు దీనికి సంబందించిన వీడియో ఒకటి షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.