గ్లామర్ గానే కాదు డీ గ్లామర్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న 10 మంది హీరోయిన్స్ …!
glamor heroines సినిమా అంటేనే గ్లామర్ అన్నట్టుగా ఉంటున్నాయి ఇప్పటి సినిమాలు, కానీ కొన్ని హిట్ సినిమాలు గ్లామర్ అనే పదానికే పూర్తి వ్యతిరేకం అని చెప్పొచ్చు. ఇప్పటి హీరోయిన్స్ మంచి పాత్ర అయితే చాలు డీ గ్లామర్ గా నటించడానికి, హీరోకి తల్లిగా నటించడానికి కూడా వెనుకాడట్లేదు. ఇలా డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన కొంతమంది హీరోయిన్స్ వీరే…
అనుష్క:

అనుష్క అంటేనే ప్రయోగాలకు మారుపేరు, సినిమాలోని పాత్రలకి తగ్గట్టు తన శరీర ఆకృతిని మార్చుకుంటూ, ఇంత వరకు ఏ హీరోయిన్ చేయని సాహసాలు చేసింది. తను గ్లామర్ పాత్రలలో నటించి కుర్రకారుని కూడా నిద్రపట్టకుండా చేసిన పాత్రలు ఉన్నాయి . అలాగే తను “బాహుబలి” సినిమాలో దేవసేన పాత్రలో డీ గ్లామర్ గా నటించి ప్రజల మెప్పును పొందింది.
తమన్నా:

తమన్నా తన అందంతో, అభినయంతో పలు భాషల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచుకొంది. ఇలాంటి అమ్మాయి కూడా మంచి కథ పేరు తెచ్చే పాత్రా అయితే చాలు తాను కూడా డీ గ్లామర్ నటించడానికి సిద్దపడి, అటు “బాహుబలి”, “అభినేత్రి” సినిమాలలో డీ గ్లామర్ గా నటించి అభిమానుల మనసును గెలిచింది.
సమంత:

సమంతకి మొదట్లో అంత గుర్తింపు తెచ్చే పాత్రలలో నటించక పోయిన, తన పెళ్లి తర్వాత సమంతకి చాల మంచి పాత్రలు తన ముందు వచ్చి చేరాయి అందులోనిదే “రంగస్థలం” లోని రామలక్ష్మి పాత్ర . ఈ పాత్రలో తాను డీ గ్లామర్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రియమణి:

ప్రియమణి కూడా గుర్తింపు తెచ్చే పాత్రలని అస్సలు వదులుకోదు, మణిరత్నం డైరెక్షన్ చేసిన “విలన్” సినిమాలో మేకప్ లేకుండా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది.
ఐశ్వర్య రాజేష్:

ఈ హీరోయిన్ తన చిన్నప్పుడే తండ్రి కోల్పోయి కుటుంబ బాధ్యతలను మోసింది. ఈ హీరోయిన్ దివంగత నటుడు రాజేశేఖర కూతురు. తాను చిన్నపుడు ఎన్నో కష్టాలు పడడం తో తన నటనలో సహజత్వం కనబడుతుంది. ఐశ్వర్య ఎక్కువగా తమిళ సినిమాలో నటించి నప్పటికీ , తెలుగు లో “కౌసల్య కృష్ణమూర్తి”, “వరల్డ్ ఫెమస్ లవర్” సినిమాలలో డీ గ్లామర్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అమ్రితా అయ్యర్:

బుల్లితెర యాంకర్ ప్రదీప్ తెలియనివారు ఉండరేమో, ప్రదీప్ హీరో గా నటించిన “30 రోజుల్లో ప్రేమ” అనే సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాట తోనే ఈ హీరొయిన్ కి మంచి గుర్తిపు వచ్చింది. ఈ సినిమాలో డీ గ్లామర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నీలి కళ్ల చిన్నది.
రితిక:

ఈ ముద్దుగుమ్మ “గురు” సినిమాలో బాక్సర్ గా, చేపలు అమ్ముకొనే ఒక మహిళగా డీ గ్లామర్ రోల్ లో తన నటనతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మనసుని ఆకట్టుకుంది.
రాధికా ఆప్టే:

ఈ నటి “రక్త చరిత్ర” సినిమాలో ఒక సాధారణ గృహిణిగా, డీ గ్లామర్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సంజన:

సంజన గ్లామర్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఈ భామ, తెలుగులో “దండుపాళ్యం-2” లో డీ గ్లామర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అమలాపాల్:

తన మొదటి సినిమాలోనే డీ గ్లామర్ పాత్రలో నటించింది. ఈ నటి “ప్రేమ ఖైదీ” సినిమా కోసం మేకప్ కి బదులు ఆయిల్ వాడిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది.