Today Telugu News Updates
అమెరికా యువకులే తన టార్గెట్ ….ఇంతకీ తన కోరిక ఏంటో తెలుసా ?

NRI సంబంధాలను తమ పిల్లలకు చూడాలని ఎంతోమంది తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే ఇలాంటి సంబధాలను నమ్మి మోసపోయిన అమ్మాయి తరపున వాళ్ళు ఉన్నారు.
కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ గా ఉంది. ఇండియాలో ఉన్న అమ్మాయిలే NRI యువకులను మోసం చేసిన సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు కు చెందిన ఒక మహిళా, మాట్రిమోనీ లోని NRI కుటుంబాలకు చెందిన యువకులను తన బుట్టలో వేసుకొని, లక్షల్లో డబ్బులు తన కాతాలో వేసుకుంటుంది.
తన పేరెంట్స్ మద్రాస్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్స్ అని, మాది చాల పద్దతిగళ్ల కుటుంబమని, తన అందమైన ఫోటోలను మాట్రిమోనీ సైట్ లో పెడుతూ కుర్రాళ్లను ముగ్గులోకి దింపి డబ్బులు వసూల్ చేసింది.
ఈ అమ్మాయి మాయలో పడ్డ ఒక యువకుడు తనకోసం లక్షల్లో డబ్బులు పంపి తరవాత మోసపోయానని గమనించి ఆంధ్ర పోలీసులకు ఫిర్యాదు చేసాడు.