NewsTollywood news in telugu

GHMC ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పేసిన exit polls

పాలకపక్షానికి తగ్గనున్న సీట్లు 35 సీట్ల వరకు గెలవనున్న బిజెపి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్లీ హవా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చింది . కొన్ని సిట్టింగ్ స్థానాలు కోల్పోయి నప్పటికీ సొంతంగానే మేయర్ సీటును కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నా యని పలు సర్వే సంస్థలు స్పష్టం చేశాయి . ఈ మేరకు గురువారం ఎగ్జిట్ పోల్సను విడుదల చేశాయి . గ్రేట లో అతి పెద్ద పార్టీగా టిఆర్ఎస్ , రెండవ స్థానంలో ఎంఐఎం రెండు పార్టీలూ తిరిగి తమ స్థానాలను పదిల పర్చుకోనున్నాయని పేర్కొ న్నాయి . అయితే మూడవ స్థానంలో బిజెపి చేరనుందని స్పష్టం చేశాయి .

కాగా గత గ్రేటర్ ఎన్నికల కంటే ఆ పార్టీకి ఓట్లు , సీట్లు పెరుగుతున్నట్టు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి . టిఆర్ఎస్కు 38 నుంచి 45 శాతం , ఎంఐఎంకు 12 నుంచి 14 శాతం , అలాగే బిజెపి 26 నుంచి 32 శాతం , కాంగ్రెస్ 8 శాతం నుంచి 14.7 శాతం , ఇతరులకు 2 నుంచి 7.70 శాతం ఓట్లు పోలుకానున్నట్టు అంచనా వేశాయి . వివిధ సర్వే సంస్థలు అటు ఇటుగా 3 నుంచి 7 స్థానాల టిఆర్ఎ సకు పెరిగే అవకాశాలు ఉన్నాయని , అలాగే బిజెపి , ఎంఐఎంకు మరో 5 సీట్లు అటు ఇటు ఉండవచ్చని , కాంగ్రెస్ కు కూడా మూడు అటు ఇటుగా ఉండవచ్చని ఆయా సంస్థలు తెలిపాయి .

Read  priya prakash varrier viral video : హీరో నితిన్ వీపుపైకి ఎగిరే సమయంలో కిందపడిపోయిన ప్రియా ప్రకాశ్.. ఫన్నీ వైరల్ వీడియో మీకోసం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button