Viral news in telugu
Ghatkesar Student: కిడ్నాప్ డ్రామా ఆడిన బీ. ఫార్మసీ యువతి ఆత్మహత్య..!

Ghatkesar B-pharmacy Student Suicide: మొన్న కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్కేసర్ బీ ఫార్మసీ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇపుడు ఈ విషయం సంచలనంగా మారింది.
ఈ అమ్మాయి షుగర్ ట్యాబెట్లు తిని సూసైడ్ చేసుకున్నట్లు ఆదారాలద్వారా తెలుస్తోంది. యువతి ఒకేసారి ఎక్కువ మోతాదులో ట్యాబెట్లు తీసుకోవడం వల్ల మరణించిందని సమాచారం.
బీ ఫార్మసీ చదువుతున్న యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
వారం రోజుల క్రితం తనపై హత్యాచార ప్రయత్నం చేశారని బీఫార్మసీ విద్యార్థిని చేసిన రచ్చ మనందరికీ తెలిసిన విషయమే, ఈ కేసు విషయంలో పోలీసుల విచారణ చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, హత్యాచార ప్రయత్నం కూడా జరగలేదని హైదరాబాద్ పోలీసులు తేల్చేసారు.