health tips in telugu

డీహైడ్రేషన్ నుండి ఈ చిన్న చిట్కాల ద్వారా బయటపడండి … ఆరోగ్య జీవితాన్ని పొందండి…!

అసలే ఎండాకాలం పైగా వడగాలులు, ఈ సమయంలో సూర్యుడు మన బాడీలోని నీటిని తాగేస్తూ ఉంటాడు. అందువల్లే మనం డీహైడ్రేషన్ కి గురి అవుతూ ఉంటాము. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతీ రోజు 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఈ విషయాన్నీ స్వయంగా ఆరోగ్య నిపుణులే చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూస్తూ ఉంటె వీలైనంత తొందరగా ఈ చిట్కాలను పాటించాలి. అవేంటంటే… 

జీలకర్ర :-

మనం వంట చేసుకొనే సమయంలో జీలకర్రను వాడుతాము. ఇలా వాడటం ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. అలాగే శరీరంలోని వేడిని, మొటిమలను, దురదను రాకుండా చేస్తుంది. ఇది అందంతో పాటు , ఆరోగ్యాన్నికూడా కాపాడుతుంది.

జీలకర్రను ఉపయోగించే విధానం గురించి ఇపుడు తెలుసుకుందాం.  ఒక టేబుల్ స్పున్ జీలకర్ర ను , కొంచం పటికబెల్లాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి ఒక రోజు రాత్రి మొత్తం నానబెట్టాలి. తరవాత రోజు ఆ నీటిని వడబోసి తాగాలి.  ఇంకా జీలకర్ర ను పొడిగాచేసుకొని , పెరుగులో కలిపి తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

లేమన్ గ్రాస్ టీ :-

ఈ లేమన్ గ్రాస్ టీ శరీరంలోని కొవ్వు పదార్థలను కరిగిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని వేడికాకుండా ఉంచడంతో పాటు అజీర్తిని అరికడుతుంది. శరీరాన్ని కూడా అందంగా ఉండేలా చేస్తుంది. మరి ఈ  లేమన్ గ్రాస్ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం… ఒక గిన్నెలో గోరువెచ్చగా నీటిని కాచి, అందులో లెమన్ గ్రాస్ ని వేసి, కొంచెం సేపు ఆ గడ్డి నానాకా , ఆకులను తీసేసి స్నానం చేస్తే… పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఫ్రీజ్ నీరు వద్దు:-

ఈ వేసవిలో అధిక ఫ్రీజ్ నీరు తీసుకోవడం వల్ల దాహం తీరకపోగా, గొంతునొప్పి, దగ్గు, జలుబు లాంటి సమస్యలు వస్తాయి. దీనికి బదులు కుండలోని నీరు తీసుకోవడం మంచింది.  ఇలా చేయడం వల్ల పొట్ట చల్లగా మారడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.

ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది:-

మద్యపానం సేవించడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి. శరీరం కూడా డీహైడ్రేషన్ కి లోనవుతుంది.  ఈ ఆల్కహాల్ కి బదులు మంచి పండ్ల రసం తాగడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ప్రతీసారి నీరు తాగడం నచ్చనివారు, ఇలా చేయవచ్చు.

వేపుడు పదార్థాలు :-

ఈ ఎండ వేడికి ఎక్కువగా వేపుళ్లు , మసాలాలు ,నూనెలు  ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక వేడి శరీరంలో  మొదలై పాదాలలో పగుళ్లు వచ్చి నొప్పిపెడుతుంది. అలాగే నాన్ వెజ్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అధికవేడి శరీరం లో  కలిగి అజీర్తి కూడా తలెత్తుతుంది.

టీ , కాఫీ పదార్థాలు:-

మనం బయట తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం, ఆ సమయంలో ఒకేసారి వేడి పదార్థాలైనా టీ , కాఫి లను తీసుకుంటాం, ఇలాంటప్పుడు శరీరంలో అత్యధిక వేడి పుడుతుంది. దీనికి గల కారణం అందులో ఉండే కెఫిన్ .  వీటికి బదులు మజ్జిగ, పళ్లు , నిమ్మకాయ తో చేసిన రసం, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల  డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button