ఇలా చేయటం వాళ్ళ ఆడపిల్లల తల్లి తండ్రులకి 71 లక్షలు :-

sukanyayojana : * అవును మీరు విన్నది మేము చెప్పేది నిజమే. ఆడపిల్ల పుడితే బాధ పడి తల కొట్టుకునే వారు ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే తల కొట్టుకునే బదులు పుట్టిన ఆడపిల్ల కి ధనలక్ష్మి అని పేరు పెట్టుకొని మరి గారాలపట్టి లాగా పెంచుతారు. ఇక మ్యాటర్ లోకి వెళ్దాం.
* మన దేశ ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆడపిల్ల పుడితే , ఆ పాప పెరిగి పెద్దయ్యి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 71 లక్షల రూపాయిలు సొంతం చేసుకొని అవకాశం కలిపించారు.
* మనందరికీ తెలుసు మోడీ గారు బేటీ బచావో, బేటీ పడావో(సేవ్ ది గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ ది గర్ల్ చైల్డ్) అనే సుకన్య సమృద్ధి యోజనను తీసుకొచ్చారు. ఈ సదుపాయాని ఆడపిల్లల తల్లితండ్రులు లేదా గార్డియన్లు వినియోగించుకోవచ్చు.
* ఈ పథకం లో భాగంగా మీరు చేయవలసిన పని ఒక్కటే , మీకు దగ్గరలో ఉన్న SBI / పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతాని తెరుచుకొని 250 రూపాయిలు అకౌంట్ ఓపెన్ చెయ్యడం కోసం డిపాజిట్ చేసి ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
* అయితే మీరు ప్రతి నెల ఈ అకౌంట్ లో 1000 రూపాయిలు జమ చేసుకుంటూ వెళ్తే మీకు అకౌంట్ మెచ్యూర్ అయ్యేసరికి సుమారు 5 లక్షలు పైన వస్తాయి. ఒకవేళ ప్రతి నెల 12500 కడితే మీకు 15 ఏళ్ల పూర్తయ్యేసరికి 71 లక్షలు వస్తాయి.
* కానీ మీరు ఈ అకౌంట్ లో యేడాదికి 1.5 లక్ష రూపాయిలు కంటే ఎక్కువ జమ చేయలేము. దీనికి గల కారణం మోడీ గారు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ప్రతి అకౌంట్ లో 7.6 శాతం వడ్డీ వేస్తున్నారు. కావున మీరు ఎంత పడితే అంతా అమౌంట్ అకౌంట్ లో జమ చెయ్యలేరు.
* ఇదిలా ఉండగా మీరు ఈ అకౌంట్ లోని డబ్బుని పాప చదువుకి లేదా పెళ్ళి కి మాత్రమే విత్ డ్రా చేయడానికి అవకాశం కల్పించారు.
* పాపకి 18 ఏళ్ల వయసులో పడకముందే పెళ్ళి చేస్తే ఈ అకౌంట్ ప్రి మెచ్యూర్ అవుతుంది. 21 ఏళ్లు పూర్తి అయ్యాక చేస్తేనే మెచ్యూర్ అవుతుంది.
* ఎన్ని విధాలుగా ఆలోచించిన ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం పుట్టిన ప్రతి ఆడపిల్లకు బంగారు భవిష్యత్తు నీ చూపించే అవకాశం తల్లితండ్రులకు మోడీ గారు ఇచ్చిన అరుదైన కానుక. అందరూ సద్వినియోగ పరుచుకొండి.