Tollywood news in telugu

జార్జెట్ చీరల ప్రత్యేకతలు ఇవే

జార్జెట్‌ చీరల్లో ఉండే సౌకర్యం అంతా ఇంతా కాదు. అందుకే ఇంటి పట్టున ఉన్నప్పుడే కట్టుకోవాలనే నియమాలను పక్కనపెట్టి వేడుకలు, వినోదాలకూ ఈ చీరలను ఎంచుకుంటున్నారు. కళ్లు చెదిరే రంగుల్లో, మైమరిపించే డిజైన్లలో చూపరులను కట్టిపడేసే జార్జెట్‌ సొగసులివి!

 

జిగేల్‌మనిపించేలా!

ప్రింటెడ్‌ డిజైన్‌తో ఉన్న జార్జెట్‌ చీర ఘనంగా కనిపించాలంటే జరీ అంచు జోడించాలి. మరికాస్త సొగసుగా కనిపించాలనుకుంటే పూల ఎంబ్రాయిడరీతో సింగారించుకోవాలి. డిజైనర్‌ శారీలా మెరిసిపోవాలనుకుంటే పమిటతో మ్యాచ్‌ అయ్యే డిజైనర్‌ బ్లౌజ్‌ ధరించాలి.

 

కాంట్రాస్ట్‌ కలర్స్‌లో..

చక్కని కాంట్రాస్ట్‌ కలర్స్‌ ఎంచుకుంటే, జార్జెట్‌ చీర కంచిపట్టు చీరను మించి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాబట్టి ఎరుపు, నీలం, గులాబీ… ఇలాంటి ముదురు రంగులతో మ్యాచ్‌ చేయాలి. కుచ్చిళ్లు, పమిట ఓ రంగులో, మిగతా చీరంతా మరో రంగులో ఉండేలా చూసుకోవాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button