Tollywood news in telugu

నవంబర్ 22న రిలీజ్ కానున్న‘‘జార్జ్ రెడ్డి’’ !!!

*నవంబర్ 22న రిలీజ్ కానున్న‘‘జార్జ్ రెడ్డి’’*

‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ
‘‘జార్జ్ రెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా
యూనివర్శిటీలో చదువుతూ..విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా
ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా
తెరకెక్కింది..ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ
‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది..ఇప్పటికే బిజినెస్
కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్
మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా
బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

*ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ:*
‘‘కేవలం ఒక్క ట్రైలర్ తోనే మా ‘‘జార్జ్ రెడ్డి’’ చిత్రం టాక్ ఆఫ్ ది
ఇండస్ట్రీ అయ్యింది. బిజెనెస్ పరంగా కూడా మాకు మంచి ఆఫర్లు
వచ్చాయి.చివరకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ -అభిషేక్
నామా సొంతం చేసుకున్నారు.వారికి థాంక్స్.సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా
ఉన్నాం.ట్రైలర్ ఏ విధంగా ఇంట్రస్టింగ్ గా ఉందో..సినిమా కూడా దానికి ఏ
మాత్రం తగ్గకుండా ఉంటుంది.మా దర్శకుడు ఈ సినిమాను రియలిస్టిక్ గా
తీసాడు.ఎక్కడా రాజీపడకుండా అందరం కష్టపడి ఈ సినిమా తీసాం.బయోపిక్ యే
అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.అలాంటి కథ ఇది. నవంబర్ 22న ఈ
సినిమాను రిలీజ్ చేస్తున్నాం.తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమా
ఉంటుంది’’ అన్నారు

ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్
రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్
వర్మ, తిరువీర్,అభయ్,మహాతి ఇతర నటీనటులు.

సాంకేతికవర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’
కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని
అందించారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’
తల్లి పాత్రలో నటించటం విశేషం. ఇటీవల “నాల్” సినిమాకు గాను బెస్ట్
చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో
చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు.

సంగీతం -సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,
ఆర్ట్- గాంధీ నడికుడికార్,
కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్,
ఫైట్స్ -గణేష్, ఆర్కే,
అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.
స్టిల్స్ -వికాస్ సీగు,
సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్
పి ఆర్ వో: జి.ఎస్.కె మీడియా
కో డైరెక్టర్ -నరసింహారావు,
అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.
కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి
నిర్మాత:అప్పిరెడ్డి
రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button