Tollywood news in telugu

“జార్జ్ రెడ్డి” తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న “అభిషేక్ పిక్చర్స్ – అభిషేక్ నామా !!!

“జార్జ్ రెడ్డి” తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న “అభిషేక్ పిక్చర్స్ – అభిషేక్ నామా “*

నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “జార్జి రెడ్డి” తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి
సొంత చేసుకుంది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్,రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఓనర్ అభిషేక్ నామా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ” జార్జి రెడ్డి” హక్కులను పొందడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది.రీసెంట్ గా రిలీజ్ అయిన “జార్జ్ రెడ్డి” ట్రైలర్ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఒక్క ట్రైలర్ తోనే సినిమా బిజినెస్ కావడం విశేషం.

గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్
రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,
ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.
సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు.

“జార్జిరెడ్డి “చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. . ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంగీతం -సురేష్ బొబ్బిలి,

ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,

ఆర్ట్- గాంధీ నడికుడికార్,

కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్,

ఫైట్స్ -గణేష్, ఆర్కే,

అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.

స్టిల్స్ -వికాస్ సీగు,

సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్

పి ఆర్ వో: జిఎస్ కె మీడియా

కో డైరెక్టర్ -నరసింహారావు,

అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి

నిర్మాత:అప్పిరెడ్డి

రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button