News
సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్న … గ్యాస్ బండ …!

ఒక వైపు పెట్రోలు, డీజిల్ ధరల పెరిగి సతమతమవుతున్న ప్రజలు , ఇపుడు తాజాగా సామాన్యుడికి వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేవలం ఒక్క నెలలోనే మూడు సార్లు వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.25 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటన విడుదల చేశాయి.

ఇపుడు పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఈ నెల 4వ తేదీన సిలిండర్‌పై రూ.25 పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15వ తేదీన మరో రూ.50 పెరిగింది. ఇలా మూడుసార్లు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో కేవలం ఈ ఒక్క నెలలోనే మొత్తంగా రూ.100 వరకు పెరిగింది.