గణపతికి గరిక ఆంటే ఎందుకు ఇష్టమో తెలుసా
బుధవారాల్లో గణపతి కి ఈ ఒక్క ద్రవ్యాన్ని సమర్పిస్తే చాలు మీ బాధలన్ని పటాపంచలు అవుతాయ్.
బుధవారాల్లో గణపతి కి గరిక పూజ ఒక నిర్ణీతమైన నామం తో చేయాలి.అలా చేయడం వల్ల గణపతి సంతుష్టుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెబుతారు.గణపతి కి గరిక కు అలాంటి సంబంధం కలదు.ఒకనాడు యమధర్మరాజు నుండి ఆవిర్భవించిన అనలాసరుడు స్వర్గం పైకి దండెత్తి రాగా తప్పించుకునే అవకాశం లేని ఇంద్రుడు గణపతి స్వామిని రక్షించమని వేడుకోగా భక్త ప్రియుడు అయిన గణపతి ఆ రాక్షసుని శంకరులు హాలాహలం మింగిన విధంగా ఆ అనలాసరుని స్వామి వారు మింగారు.కాని రాక్షసుడి వల్ల ఉదరము లో తాపం ఏర్పడగ శివుని ఆజ్ఞ మేరకు ఆయన శరీరం పైన గరికలు ఉంచడం వల్ల తాపం తగ్గిందిట.అప్పటి నుండి స్వామి గరిక ను ఇష్టపడి ఆ గరిక తో పూజ చేసేవారికి సులభంగా అనుగ్రహిస్తాడు అంట .
బుధవారం బుధునికి ఇష్టమైన రంగు లేత ఆకుపచ్చ ఆ ఆకుపచ్చ రంగు లో ఉంటుందినేడు ఆయన్ని కనీసం 21గరిక లతో ఓం దూర్వాయుగ్మ ప్రియాయ నమః అనే నామం తో సంకల్ప యుక్తము గా సేవించి వెంటనే ఫలితాలు పొందండి.ముఖ్యంగా వ్యాపార అభివ్రుధ్ధి,విద్యలో ఆటంకం తొలగి పోతుంది.
ఓం శ్రీ గణేశాయ నమః