Gamanam Movie Review and Rating హిట్టా ఫట్టా :-

Movie :- Gamanam (2021) Review
నటినటులు : – ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, శ్రేయ, సుహాస్, నిత్యా మీనన్ తదితరులు.
నిర్మాతలు : – రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జ్ఞాన శేఖర్ VS.
సంగీత దర్శకుడు :- ఇళయరాజా
దర్శకుడు :- సుజనా రావు
Story ( Spoiler Free ):-
ఈ కథ మూడు విభిన్న కథనాల చుట్టూ తిరుగుతుంది. మొదటిగా శ్రేయ నీ చెవిటి తల్లి గా మరియు భార్య గా పరిచయం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆమె భర్త కోసం ఎదురుచూస్తుంది. భర్త దుబాయ్ లో పనిచేస్తుంటాడు. ఇంకో పక్క క్రికెటర్ గా లైఫ్ లీడ్ చేయాలని చాలా కష్ట పడుతున్న శివ కందుకూరి కథ మొదలవుతుంది. ప్రియాంక జవాల్కర్ శివ యొక్క లవర్. విరి కధతో పాటు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఎన్నో విధాలుగా కోరుకునే ఇద్దరు పిల్లల కథ. ఇలా ముగ్గురి వేరే వేరే కథలతో ఈ సినిమా సాగుతుంది.
ఒకానొక సమయం లో ముగ్గురి జీవితాలలో ఎదురుకొలేని సమస్య వస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఎంటి ? ముగ్గురి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి ? వీటన్నిటి మధ్య నిత్య మీనన్ పాత్రేంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍 :-
- సినిమాలో అందరూ చాలా బాగా వారి వారి పాత్రలలో జీవించేశారు. అందరి కంటే శ్రియ కొత్తగా మరియు విభిన్న నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది.
- దర్శకుడు సుజన రావు సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపిన విధానం బాగుంది.
- క్లైమాక్స్ బాగుంది.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు పర్వాలేదు
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
Negatives 👎 :-
- సినిమా స్లో గా సాగుతుంది.
- నిత్య మీనన్ పాత్ర
- ఎడిటింగ్ ఇంకా చేయాల్సి ఉంది.
- లెంగ్త్ ఎక్కువ
Overall :-
మొత్తానికి గమనం అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా అంత్రోలజీ స్టోరీ సినిమాలు నచ్చే వారికి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. శ్రేయ చాలా బాగా చేసింది. మిగితా పాత్రధారులు వారివారి పాత్ర మేరకు బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా కి తగ్గినట్లుగా ఉంది.
దర్శకుడు కథను నడిపే విధానం చాల బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చాల బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా ఈ సినిమాని ఓసారి చూసేయచ్చు .
Rating :- 2.25 /5