Tollywood news in telugu
కరోనా విషయంలో నాగార్జున పరిస్థితి ఏంటి…. పూర్తి వివరాలు !

రెండు రోజులక్రితం మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా బారిన పడ్డట్టు తానే స్వయంగా ప్రకటించాడు. ఈ విషయం బయటికి వచ్చాక చిరును కలిసినవారు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ తరుణంలో చిరు, నాగార్జున ఒకే కారులో సీఎం ని కలవడానికి వెళ్లిన సంగతి తెలిసిందే, వీరిద్దరూ మాస్క్ లేకుండా కలిసి తిరగడంతో నాగార్జున ఫాన్స్ కూడా ఎంతో ఆందోళనకు లోనయ్యారు.
ఈ నేపథ్యంలో నాగార్జున వెంటనే కరోనా పరీక్షలు చేయిన్చుకున్నారు, ఈ పరీక్షలో నాగార్జునకు నెగెటివ్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.
ఈ విషయం తెలియడంతో అటు నాగ్ కుటుంబ సభ్యులు, అభిమానులు, బిగ్ బాస్ టీమ్ ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే నాగార్జున గారు ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండడంతో నిబంధనల ప్రకారం నాగ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.