Viral news in telugu

అందమైన యువతితో కొన్నేళ్లుగా స్నేహం , ఆ తర్వాత స్నేహితుడి లవ్ ప్రపోజల్.. ఈ విషయాన్నీ తల్లికే వాట్సప్ చేయడంతో..

Friendship with a beautiful young woman for a few years

దేశం లో నిమిష-నిమిషానికి మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయ్. స్కూల్ దగ్గరినుండి పనిచేసే ఆఫీస్ ల వరకు మహిళలు  వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇంకా గోరమైన విషయం చెప్పాలంటే  సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా రక్షణ లేకుండా పోయింది. మనకుటుంబంలోని  కన్న తండ్రి, తోడబుట్టిన అన్నలే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయ్.

 తాజాగా ఒక యువకుడు , ఓ యువతి ని ప్రేమిస్తున్నానంటూ.. వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్ ద్వారా ఇబ్బంది పెట్టడంతో  అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది.  అతడితో మాట్లాడటమే మానేసింది. దీంతో ఆ వ్యక్తి ఆ అమ్మాయి వాళ్ళ  తల్లి ఫోన్ నెంబర్ ను దొరకబట్టి. ఆమెకు  వాట్సప్ లో ఒక ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ను చూసిన తల్లి ఆశ్చర్యానికి గురై కాస్త బయాందోనలకు లోనైంది. ఈ విషయాన్నీ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు అతడిని కటకటాల్లోకి పంపించింది. ఈ ఘటన రాజధాని  హైదరాబాద్ చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ నగరం లోని బైరామల్ గూడకు చెందిన గుజ్జ శ్రీధర్ రెడ్డి అనే యువకునికి కొన్ని సంవత్సరాల క్రితం , బస్టాప్ లో ఒక ఇంటెర్మీడియేట్  చదివే అమ్మాయి  పరిచయం అయింది. ఇలా కొన్ని సార్లు బస్టాప్ లోనే కలవడంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇక వీరిద్దరి   ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహం ముసుగులోనే ఆ యువకుడు మాట్లాడుతూ ఆమె ఫొటోలు, వీడియోలను రాబట్టాడు. ఇలా ఒక 5 సంవత్సరాలు గడిచింది. ఇలా 5 సంవత్సరాల తరువాత ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజ్ చేసాడు ఆ యువకుడు.  దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతికి  అతగాడి ప్రపోజల్ ను ఒప్పుకోలేదు. వెంటనే ఫోన్ నంబర్ ని కూడా  బ్లాక్ చేసేసింది.

ఇలా కొంతకాలం పాటు ఆ యువతితో మాట్లాడక పోవడంతో అతనికి కోపమొచ్చి, శ్రీధర్  ఆ యువతి తల్లి ఫోన్ నెంబర్ ను కనిపెట్టాడు.  ‘నీ కూతురు నన్నే ప్రేమించాలి. లేదని ఇంకెవరిని ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా బాగుండదు అంటూ .. నా వద్ద మీ  అమ్మాయి ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలి మిమ్మల్ని బజారుకీడుస్తా అని బెదిరించాడు.

ఈ విషయం తెలుసుకుని ఆ తల్లి భయబ్రాంతులకు లోనైంది.  కూతురిని అడిగి అసలు విషయం తెలుసుకొని , ఆ తల్లి  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ను వెతికి పట్టుకొని  అరెస్ట్ చేశారు. కేసు ఫైల్ చేసారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button