Tollywood news in telugu

Friday Releasing Movies: ఈ శుక్రవారం విడుదల కానున్న 4 సినిమాలు…ఇక ప్రేక్షకులకు పండగే..!

Friday Releasing Movies List

Friday Releasing Movies List: మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ సినిమా హాళ్లు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. ఇన్నిరోజులు సినిమాలు లేక బోర్ ఫీలైన సినీ అభిమానులు ఇపుడు వీకెండ్స్ కి సరదాగా బయటికివెళ్ళి సినిమాలు చూసే రోజులు వచ్చేసాయి. కరోనా వ్యాప్తి తగ్గడం.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో సాధారణ స్థితులు వచ్చాయి.

కేంద్రం థియేటర్ల ఆక్యూపెన్సీ కూడా పెంచడంతో సినిమా హాళ్ల ముందు సందడి వాతావరణం కనబడుతుంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ తర్వాత విడుదలై క్రాక్‌, ఉప్పెన వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ శుక్రవారం రోజు ఏకదాటిగా 4 సినిమాలు విడుదలకానున్నాయి. ఇందులో ఒకటి సుశాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘కపటధారి’  కాగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  రెండోది సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన విశాల్‌ చిత్రం ‘చక్రం’ కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది.  మూడోది ఈ వారాంతం వస్తోన్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘నాంది’ నరేష్‌ సీరియస్‌ రోల్‌లో నటిస్తూ.. ఆసక్తికరమై కథనంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక వీటితో పాటు నాల్గవది   కన్నడ డబ్బింగ్‌ చిత్రం ‘ పొగరు’ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read  అందాల అనసూయా....

ఇలా ఈ శుక్రవారం విడుదల కాబోతున్న 4 సినిమాలలో ఏది ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచిచూడాల్సిందే.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button