friday mata’s aradhana
శుక్రవారం నాటి అమ్మవారి ఆరాధన క్రమం
ఈరోజున శుక్రవారం ముఖ్యం గా అమ్మ వారి ఆరాధన అన్నది మనకు శుభాలు కలిగిస్తు ఉంటుంది. అమ్మవారు శక్తి స్వరూపం సకల జగములకు ఆమె శక్తి ని అందిస్తుంది , చివరికి పరమేశ్వరుని శక్తి కూడా అమ్మ వారే . . అలాంటి అమ్మవారి ని శుక్రవారం ఏ రీతిన పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది ఈ కథనంలో చూద్దాం.
ముఖ్యం గా శుక్రవారం అనే కాకుండా ప్రతి రోజు అమ్మవారిని సూర్యోదయం కన్నా ముందే స్నానాదికాలు పూర్తి చేసుకుని అమ్మ వారికి చేసే దీపారాధన , కుంకుమ అర్చన , యధా శక్తి పుష్ప అలంకరణ, గంధం , ధూపం , నైవేద్యం మున్నగునవితో పాటు . . సత్ప్రవర్తన, నీతి , ధర్మాచరణ అన్నవి అమ్మ కరుణ ని కలిగిస్తాయి.ఇంకో విషయం అమ్మవారికి ‘ నామ పారాయణ ప్రీత’ అని పేరు ఉంది అమ్మ వారి నామామృతమును సదా వల్లె వేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహము పొందవచ్చు.యధాశక్తి అష్టోత్తర నామాలు కాని , సహస్ర నామాలు గాని ఏదైనా స్తుతి , స్తోత్రాల పారాయణ ఇంకొక విధానం లో అమ్మ వారి పూజ లో తప్పకుండా అయ్య వారు అయిన పరమేశ్వరునికి ప్రాధాన్యత ఇవ్వాలికూడా ఇది మరింత సులభం గా అమ్మ కరుణ ని కలిగిస్తుంది, ఎందుకంటే శివుడు శక్తి వేరువేరు కాదు అవిభక్త పరమాత్మ స్వరూపమే శివ శక్తులు. కాబట్టి పై సులభ విధానాల ద్వారా మీరంతా ఆ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహము పొందుతారు అని ఆశిస్తూ . . . సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు