Today Telugu News Updates
ఫ్రీ షాపింగ్ ఇన్ హైదరాబాద్… కేవలం వీళ్లకు మాత్రమే !

గత అక్టోబర్ నెలలో హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికీ ఆదుకునేందుకు ‘ది సఫా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.
ఒక వినూత్న రీతిలో బాధితులకు సహాయం చేస్తుంది. హైదరాబాద్ లోని బాలాపూర్ లోని ‘పెరల్స్ గార్డెన్’ లో 3 రోజులపాటు బాధితులకు అవసరమైన వస్తువులను ఫ్రీగా తీసుకొనే సదుపాయం కల్పించింది.
ఆ వస్తువులు తీసుకోవాలంటే ఇంతకముందు ఈ సంస్థ వారు బాధితులకు జరిగిన నష్టాన్ని బట్టి అందించిన రూ . 5 వేలు, రూ . 10 వేల కూపన్లను తీసుకొని వస్తే వారికీ కావలసిన వస్తువులను తీసుకెళ్లొచ్చు అని సంస్థవారు తెలిపారు.