forwarded lable in whatsapp
ఈ రోజుల్లో ‘వాట్స్ఆప్’ తెలియని వారు లేరు. సినిమా పాటల్లో సైతం ‘వాట్స్ఆప్’ పేరు వినిపిస్తోందంటే దీని వాడకం ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వాట్స్ఆప్ వల్ల ఎంత ప్రయోజనం కలుగుతోందో దీనిని అడ్డం పెట్టుకుని అంతే కీడు చేస్తున్నారు కొందరు దుర్మార్ద్గులు. వాట్స్ఆప్ లో చాలా ‘ఫేక్ న్యూస్’ ఫార్వార్డెడ్ మెసేజ్ కింద వస్తూ ఉంటుంది. అది ఎంత మేరకు నిజం, పంపించిన వారు పంపారా లేక వారికి వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసారా అన్నది తెలియదు. దీని వల్ల కొన్ని తప్పుడు వార్తలు చేరి ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నష్టం వాటిల్లింది.
ఈ తరుణంలో ఈ సంస్థ ఒక కొత్త ఫీచర్ ను ప్రారంభించింది. అదే ఈ ‘ఫార్వార్డెడ్’ లేబిల్. ఈ లేబిల్ ప్రస్తుతం కొన్ని అప్డేటెడ్ వెర్షన్లలో అందుబాటులో ఉండగా మరి కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఎవరైనా తమకు వచ్చిన ‘ఫార్వర్డ్’ మెసేజ్ మరొకరికి పంపించినప్పుడు ఆ టెక్స్ట్లో పైన ‘ఫార్వార్డెడ్’ అని ఉంటుంది. ఈ లేబిల్ ను ఏ విధంగానూ తీసేయ్యలేము. ఈ విధంగా వచ్చిన మెసేజ్ ను ఏ మేరకు నమ్మవచ్చు అన్నది కొంత మేర తెలుస్తుందని అంటున్నారు నిపుణులు.