ఆహార వైద్యం గురించి తెలుసా?
ఆహార వైద్యం గురించి మీకు తెలుసా ? ? ? దాని ప్రాముఖ్యత వల్ల మనకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఎన్నో తగ్గించుకోవటం ఖాయం.
ఆహార వైద్యం ఈ మధ్యన తరచూ వినిపిస్తున్న పదం. ఈ విధానం పాతదే అయినా కూడా ఈ మధ్యన మళ్ళీ తెరమీదకు వచ్చింది. మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఒకవేళ వచ్చినా కూడా చాలామటుకు ఆహార పదార్థాలు ఉపయోగించి లేదా మన ఆహరం లో ఆ సమస్యను పెంచే పదార్థాన్ని తగ్గించి లేదా త్యజించి ఆ రుగ్మతలు పోగొట్టుకోవడం ఆహార వైద్యం లో ముఖ్యమైనది.
మన పెరట్లో, వంటింట్లో, పోపుల డబ్బాలో ఉండే చాలా మొక్కలు, మసాలాలు, చిన్న చిన్న దినుసులు అదే విధంగ తీసుకోవడం లేదా వేరే ఏదైనా పదార్థంతో కలిపి తీసుకోవడం.లేదా అటువంటి పదార్థాలను వండటము, ఉడక పెట్టడం, ఎండబెట్టడం లాంటి ప్రక్రియలో తయారు చేసుకుని తీసుకోవడం ద్వారా మన సమస్యలు తగ్గించుకోవడం సులభం. ఇలాంటివి ఒకప్పుడు మన ప్రాచీన వైద్య విధానాలలో ఉన్నాయ్. ప్రాచీన వైద్య శాస్త్ర తాళపత్ర గ్రంధాలు పరిశీలన చేస్తే ఇలాంటి విషయాలు బయట పడతాయి. వీటిని పాశ్చాత్య దేశాలవారు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు.
ఈమధ్య ఇలాంటి విధానాలను మన దేశంలో కూడా ఉపయోగించి తద్వారా అల్లోపతి మందుల వాడకం తగ్గించి ఆ మందుల ద్వారా శరీరంపై పడే సైడ్ ఎఫెక్ట్ లను తగ్గించడం కోసం చాలా కృషి జరుగుతుంది. మంతెన సత్యనారాయణ లాంటి వారు అప్పట్లోనే ఈ ప్రకృతి ఆహర వైద్యాన్ని ప్రోత్సహించగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో వీరమాచనేని, డాక్టర్ వలీ లాంటి వారు ఈ విధానాలు ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న విషయం తెలిసిందే.