Political News

నగరంలో మిన్నంటిన నిరసనలు, Flood victims protest

వరద బాధితులకు సహాయం కార్యక్రమంలో అవకతవకలను నిరసిస్తూ Flood victims protest పెద్ద ఎత్తున నిర సన వ్యక్తం అవుతుంది . శనివారం కాప్రా సర్కిల్ పరిధి లోని కాప్రా , ఏఎస్ రావునగర్ , చర్లపల్లి , మీర్ పేట హెచ్ బీ కాలనీ , మల్లాపూర్ , నాచారం డివిజన్లకు సంబంధించిన బాధిత ప్రజలు కాప్రా సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు . అర్హులైన బాధితులు అందరికి న్యాయం చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఉదయం సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు . సర్కిల్ కార్యాలయానికి బాధితులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో సిపిఐ , సిపిఎం , టిడిపి తదితర పార్టీలు బాధితులకు సంఘీభావాన్ని ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నా యి .

లోతట్టు ప్రాంతాలలో అర్హులైన వారందరికి ఇంటికి రూ .10 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ప్పటికి అధికారులు , టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై వరద బాధితుల సహాయాన్ని పంచుకు తిన్నారని ధ్వజమె త్తారు . కొన్ని కాలనీలలో అద్దెకు ఉన్నవారి సైతం డబ్బులు ఇచ్చి కొన్ని మురికివాడలు , లోతట్టు ప్రాంతాలలో అర్హు లైన వారికి డబ్బులు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమి టని ఆందోళనకారులు ప్రశ్నించారు . జమ్మిగడ్డ , గణేష్ గర్ , హనుమాన్‌నగర్ , చర్చి కాలనీ , అంబేద్కర్ నగర్ , వెంకట్ రెడ్డినగర్ , పుకట్ నగర్ , ఎల్లారెడ్డిగూడ , వంపు గూడ , గాంధీనగర్ , నాచా రం , మల్లాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్ర జలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టా రు . తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆం దోళన కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించా రు . ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె.ర మేష్ యాదవ్ , ఏ.వినోద్ , మర్రి మోహన్‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు .

Flood victims protest ::

గాంధీనగర్ వాసుల రాస్తారోకో … కాప్రా డివిజన్ గాంధీనగరవాసులు రాధికదమ్మాయిగూడ రోడ్డులో పెద్ద ఎత్తున రాస్తారోఖో కార్యక్రమాన్ని నిర్వహిం చారు . దీంతో పెత్త ఎత్తున రాకపోకలకు అంతరాయం జరిగింది . ఆందోళనకారులు కార్పొరేటర్లు , ఎంఎల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టు న నినాదాలు చేశారు . అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని డిమాండ్ చేశారు . కుషాయిగూడ పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కార్యక్రమాన్ని విరమింపచేశారు . యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సత్యనారాయణ , కార్తీక్ , శ్రీకాంత్ , బాల కృష్ణ , మధు పాల్గొన్నారు .

అల్వాల్……  వరద బాధితులకు అందవలసిన నష్ట పరిహారం పక్కదారి పడుతుందని టిడిపి మచ్చబొ ల్లారం 133 డివిన్ అధ్యక్షుడు నర్ల సురేష్ ఆరోపించారు . శనివారం బాధితులతో కలిసి సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో సానుభూతితో బాధితు లకు రూ . 10 వేల నష్టపరిహారం అందించడానికి కృషిచే స్తుంటే స్థానిక నాయకులు మాత్రం పదివేలను పక్కదారి పట్టించి తమ అనుచరులకు , బాధితులు కానివారికి పది వేల పరిహారం అందిస్తున్నారని తెలిపారు . కొన్ని ప్రాంతా లలో పదివేలకు బదులు ఐదువే ఇచ్చారని బాధితులు ఆవే దన వ్య క్తం చేస్తున్నారు . దేవుడు వరమిచ్చిన పూజారి కని కరించనట్లు ఉంది నాయకుల తీరు అంటున్నారు .

తక్ష ణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిజమైన బాధితులను గుర్తించి రూ .10 వేల నష్టపరిహారం అందజేయాలని కోరారు . బాధితులకు మద్దతుగా జేఏసీ నాయకులు పి . సురేందర్ రెడి ధర్నాలో పాల్గొన్నారు . పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం సరైనా మార్గదర్శకాలు రూపొందించకుండానే కోట్లాది రూపాయాలు విడుదల చేయడంతోనే అవకతవ కలు జరుగడానికి అవకాశం ఏర్పడిందన్నారు . కరోనా సమయంలో ఇచ్చిన మాదిరిగానే ఎవ్వ రి ఖాతాలో వారివి జమచేస్తే ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టేది కాదన్నారు . డబ్బుల పంపిణీ విషయంలో జరిగిన లోటు పాట్లను సవ రించి బహుశ లో ప్రభుత్వం ఇచే ఆర్థిక సహాయానికి కచ్చితమై ఉన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు . అప్పడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో వరద బాధితులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button