technology information

రీసెంట్ గా లాంచ్ చేసిన ఫ్లిప్కార్ట్ ప్లస్ ఫీచర్స్, సబ్స్క్రిప్షన్ ఫీజు

ఈ మధ్యకాలంలో షాపింగ్ అంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే హాయిగా కూర్చొని మనకు నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు. దీనీనే ఆన్లైన్ షాపింగ్ అంటారు. ఈ ఆన్ లైన్ షాపింగ్ అనగానే ముఖ్యంగా చాలా మందికి గుర్తుకు వచ్చే రెండు అతి పెద్ద రిటైల్ దిగ్గజాలు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ రెండు కంపెనీల మధ్య పోటీ ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది. కస్టమర్స్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ మరియు సేల్స్ తో ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగా భారతదేశంలో అమెజాన్ అమెజాన్ ప్రైమ్ పేరుతో కస్టమర్స్ రకరకాల ఆఫర్స్ ని అందిస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తన ప్రధాన ప్రత్యర్ధి అయిన అమెజాన్ ప్రవేశపెట్టిన అమెజాన్ ప్రైమ్ కి మరింత గట్టి పోటీ ఇవ్వడానికి  ఒకప్రారంభించటానికి ఫ్లిప్కార్ట్ అన్నిటిలో ఉంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ అని పిలవబడే, విశ్వసనీయ కార్యక్రమంని ఆగస్టు 15 వ తేదీ నుండి ప్రారంభించింది.

ఫ్లిప్కార్ట్ ప్లస్ ( flipkart plus ) లాయల్టీ ప్రోగ్రామ్ ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు ప్రయోజనాలు మరియు బహుమతులను అందిస్తుందని తెలిపారు. ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ గురించిన అన్ని వివరాలు మరియు ఇది వినియోగదారులకు అందించే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఫ్లిప్కార్ట్ యొక్క ఈ కొత్త లాయలిటీ ప్రోగ్రామ్ తన ప్రధాన రైవలరీ అయిన అమెజాన్ ప్రైమ్ సర్వీస్ వలె ఉంటుంది. అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది అమెజాన్ ప్రైమ్ ప్రారంభించిన దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు వస్తుంది.
  2. ఫ్లిప్కార్ట్ ప్లస్ ( flipkart plus ) కోసం ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీజు ఉండదు. ‘ఫ్లిప్కార్ట్ ప్లస్’ మెంబెర్ షిప్ ప్రోగ్రాం కోసం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీజు ఉండదు. ఈ కస్టమర్ లాయలిటీ కార్యక్రమం పూర్తిగా ఉచితం. అమెజాన్ ఈ ప్రైమ్ మెంబెర్ షిప్ ని రూ. 499 కి స్టార్టింగ్ ఆఫర్ గా అందించింది. ప్రస్తుతం, అమెజాన్ ప్రైమ్ యొక్క యాన్యువల్ ఫీజు రూ .999 మరియు మంత్లీ ఫీజు రూ.

ఫ్లిప్కార్ట్ ప్లస్ ప్రయోజనాలు:

ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ ( flipkart plus ) సర్వీస్ కస్టమర్స్ కి ఫాస్ట్ మరియు ఫ్రీ డెలివరీ కోసం ఆప్షన్ ని ఇస్తుంది. ప్రారంభించిన కొన్ని స్మార్ట్ ఫోన్స్ కి ముందుగానే యాక్సెస్ మరియు కస్టమర్ సపోర్ట్ కి ప్రాధాన్యత ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ వలె, ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు కూడా సేల్స్ సమయంలో ఎర్లీ యాక్సెస్ పొందుతారు.

ఫ్లిప్కార్ట్ ప్లస్ ఎలా పని చేస్తుంది?

ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ వెబ్ సైట్ లో చేసిన ప్రతి కొనుగోలుపై ప్లస్ కాయిన్స్ ని అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ “ప్లస్ కాయిన్స్” అనే శక్తివంతమైన కరెన్సీ ద్వారా ఆధారితమైన కస్టమర్ ప్రయోజనాల కార్యక్రమం” అని సంస్థ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ ప్లస్ నాణేలను కంపెనీ వెబ్ సైట్ లో తరువాత షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. కస్టమర్స్ ఈ ప్లస్ కాయిన్స్ ని అన్ని కొనుగోళ్లలో లేదా కొన్ని ప్రత్యేకమైన కాటగిరి ప్రొడక్ట్స్ పైన మాత్రమే పొందుతారా అనేది ఇంకా తెలియదు. ఈ ప్లస్ కాయిన్స్ ని Zomato, BookMyShow, MakeMyTrip మరియు కొన్ని ఇతర వెబ్ సైట్స్ లో కూడా ఉపయోగించవచ్చు.

ఫ్లిప్కార్ట్ ప్లస్ ( flipkart plus ) కస్టమర్స్ రూ 250 షాపింగ్ చేస్తే ఒక ఫ్లిప్కార్ట్ ప్లస్ కాయిన్ సంపాదించుకోవచ్చు. వెల్ కమ్ ఆఫర్ లో భాగంగా ఇ-టెయిలర్ కొన్ని ఉచిత ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబెర్స్ ixigo నుండి ఫ్లైట్ బుకింగ్స్ లో రూ .400 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, ఒక బెవేరేజ్ కొంటే మరొక బెవేరేజ్ ఛాయ్ పాయింట్ నుండి ఫ్రీగా పొందవచ్చు, బుక్ మై షో నుండి మూవీ టిక్కెట్లపై రూ.100 మరియు దీనితో పాటు రూ.499 స్పెండ్ చేస్తే ఒక బెవేరేజ్ ఫ్రీగా పొందవచ్చు.

మీకు 50 ఫ్లిప్కార్ట్ ప్లస్ ( flipkart plus ) కాయిన్స్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే, కంపెనీ కొన్ని రాబోయే ఆఫర్ల లిస్ట్ ని తెలిపింది. అవి 50 కాయిన్స్ బాలన్స్ తో వినియోగదారులు వివిధ ఆఫర్ల నుండి ఫ్లిప్కార్ట్ వౌచెర్ రూ .1,000 విలువతో సహా రూ. 1,200 రూపాయల బుక్ మై షో నుండి, 1,900 రూపాయల విలువైన Zomato గోల్డ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ , MakeMyTrip నుండి 1,100 రూపాయల గిఫ్ట్ కార్డు మరియు Hotstar యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్రీమియం.

 

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button