telugu facts

Financial tips for newly married couple

financial tips for newly married couple

financial tips-for newly married-couple :: “ధనం మూలం ఇదమ్ జగత్ “ అనే మాట అందరు వినే ఉంటారు. ప్రపంచంలోని డబ్బు చాలా ప్రధానమైనది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు మనకు కావాల్సిన అవసరాలు తీరాలంటే తప్పనిసరిగా డబ్బు కావాలి. బాచిలర్ లైఫ్ లో ప్రతి ఒక్కరు తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. పెద్దగా ఫైనాన్సియల్ విషయాలను గురించి పెద్దగా పట్టించుకోరు. డబ్బు ఆదా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చు. ఒకసారి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయితే ఇవన్నీ మారిపోతాయి. పెళ్లి అనేది ఒక తియ్యని వేడుక. భార్య, భర్త ఇద్దరు అందమైన ఆశల ప్రపంచం వైపు అడుగులు వేస్తూ కలసి సాగించే సరికొత్త ప్రయాణం. మరి ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా, అర్థవంతంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే కాస్తంత ఆలోచన, శ్రద్ధ అవసరం. పెళ్ళైన తరువాత ప్రతి వ్యక్తికీ భాధ్యతలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా దంపతులు ఇద్దరూ మంచి ఆర్థిక అవగాహన కలిగి ఉంటే వారి జీవితo ఆనందమయమవుతుంది.

financial tips for newly married couple

కొత్తగా పెళ్ళైన వారు కొన్ని ముఖ్యమైన financial tips చిట్కాలను పాటిస్తే చాలు వారికి భవిష్యత్తులో రాబోయే చిన్న చిన్న ఆటుపోట్లను సులభంగా అధిగమించి జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.

ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం:

కొత్తగా ఒక సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు తమ జీవితానికి ఎంతో అవసరమైన ఓ ఆర్థిక ప్రణాళికను ప్లాన్ చేసుకోవాలి. వీలైతే సొంతంగా, లేదంటే ఓ మంచి financial ఎక్స్పర్ట్ సలహాలను తీసుకుంటే మంచిది. ఇద్దరూ కలసి తమ ఫ్యూచర్ గోల్స్, మరియు కలల గురించి ఒక అవగాహన ఉంచుకొని వాటిని చేరుకునేందుకు కావాల్సిన ఆర్థిక సలహాలను, సూచనలను తెలుసుకొంటే మంచిది అని నిపుణుల సూచన. లైఫ్ పార్టనర్ తో కలిసి ప్రతి నెల ఉండే ఖర్చు మరియు ఎంత డబ్బు ఆదా చేయొచ్చు అనే దాని గురించి చర్చించుకుంటే మంచిది.

వచ్చే ఆదాయాన్ని బట్టి:

భార్యాభర్తలు ఇరువురు ముందుగా తమకు వచ్చే ఆదాయం మీద వార్కి స్పష్టత కలిగి ఉండాలి. ఇద్దరు జాబు హోల్డర్స్ అవునా?లేదా ఒక్కరేనా ? మొత్తం ఆదాయం ఎంత వస్తుంది? నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది, ఎంత మిగులుతుంది? అనే దానిపై స్పష్టత ఉండాలి. ఇక్కడ ఎంతవరకు డబ్బును పొదుపు చెయ్యొచ్చు? ఆ పొదుపు చేసిన మొత్తాన్ని ఫ్యూచర్ లో రెట్టింపు అయ్యేలా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మదుపు అవుతుంది. సొంతిల్లు, అందమైన కారు, పిల్లల చదువుల అవసరాలు, ఆభరణాలు, ఆరోగ్య అవసరాలు  ఇలా అన్ని అవసరాలను తీర్చేది తెలివైన మదుపే.

దుబారా ఖర్చు తగ్గించుకోవడం:

పెళ్లయిన కొత్తలో చిన్న చిన్న సరదాలు సహజం. అలా అని వాటి కోసం డబ్బును ఎక్కువగా దుబారా చేయకుండా పెద్దగా బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి సంపాదనలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని అనిపిస్తుంది. పిల్లలు పుట్టకముందే ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెడితే దాని ద్వారా భవిష్యత్తులో అధిక సంపదకు వీలు కల్పిస్తాయి.

ప్లానింగ్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం:

ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక సొంత ఇల్లూ ఉండాలి అని అనుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే కొంచెం బ్యాంకు రుణంతో కొత్త ఇల్లు ప్లాన్ చేసుకోవడం ఒక మంచి ఆలోచన. అందుకు తగినట్టుగా నెలవారీ చెల్లింపులు చేసేలా ప్రణాళిక ఉండాలి. ఇలా లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు ఉండాలి. మరీ స్వల్ప కాలానికైతే లిక్విడ్ ఫండ్స్. ఇవి ఏడాది కాలానికి 8 శాతం వరకు రాబడినివ్వగలవు. ఐదేళ్ల కాలానికి అయితే, బ్యాలెన్స్ డ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ తగినవి. దీర్ఘకాలంలో అయితే ఈక్విటీ ఫండ్స్ ద్వారా అధిక రాబడి ఆశించవచ్చు. పిల్లలు. వారు ఉన్నత చదువులకు వచ్చే సమయానికి అప్పుడు వచ్చే ఖర్చులను తట్టుకునేలా నెల నెలా కొంత మొత్తాన్ని కేటాయించాలి.

రిటైర్మెంట్ ప్లాన్:

యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంపాదనా శక్తి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ కాలం ఎప్పుడు అలానే ఉండదు. మనం అలానే ఉండము. కాలంతో పాటు వయసు మీద పడుతుంది కాబట్టి వృద్ధాప్యంలో60 ఏళ్ల వయసు తరువాత సంపాదించే శక్తి అందరికి ఉండకపోవచ్చు. అప్పుడు తలెత్తే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే పరిస్థితి ఏంటి? అందుకే, వయసులో ఉన్నప్ప్పుడే అందుకు తగిన ప్లానింగ్ చేసుకోవాలి. అందుకే ఓ మంచి పెన్షన్ పాలసీని ఎంచుకుని అందులో పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కొత్త కొత్త రిటైర్మెంట్ ప్లాన్స్ ని బ్యాంక్స్ ప్రవేశపెట్టాయి.

ఎమర్జెన్సీ అవసరాలు:

జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కష్టాలు, సుఖాలు సమ్మిళితం జీవితం. కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చి పడుతుందో ఎవ్వరు ఉహించలేరు.  ఉన్న ఫళంగా ఉద్యోగం పోతే, లేదా మానేయాల్సిన పరిస్థితే వస్తే,  ఆ సమయంలో ఆదుకునేందుకు కనీసం మూడు నెలల అవసరాలకు తగినంత మొత్తం ఎమర్జెన్సీ అమౌంట్ ని బ్యాంకు అకౌంట్ లో ఉంచాలి. ఉద్యోగం లేకపోయినా రోజు వారీ ఖర్చు తప్పదు. అలాగే, బ్యాంకు లోన్ ఇన్స్టాల్ మెంట్ కట్టకుంటే బ్యాంకర్లు ఊరుకోరు కదా. అందుకుని అత్యవసర నిధి చాలా అవసరం.

Insurance financial tips for newly married couple

ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా రకరకాల ఊహించని అనారోగ్య సమస్యలు  ఎదురవుతున్నాయి. ఒక్కసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయితే చాలు బిల్ తడిసి మోపెడు అవుతుంది.  అల్లాంటి సమయంలో మన దగ్గర డబ్బు లేకపోతే ఎంత కష్టమవుతుందో ఆలోచించండి. అందుకే ధీమాగా హెల్త్ ఇన్సురెన్స్ ఉండాలి. అది కూడా కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. భార్యతోపాటు తల్లిదండ్రులు కూడా మనపై ఆధారపడి ఉంటే వారి ఆరోగ్య అవసరాలను కూడా తీర్చేలా ఇన్సురెన్స్ ఉండాలి. పిల్లలకి స్పెషల్ ఇన్సురెన్స్ లు కూడా ఉన్నాయి. ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటే మంచిది. యాక్సిడెంట్స్ జరిగినపుడు సంపాదించే వారికి జరగరానిదే జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుకుండా ఆదుకునేందుకు ప్రమాద బీమా, జీవిత బీమాలూ తీసుకోవాలి. వాహనం ఉంటే వెహికల్ ఇన్సురెన్స్ తప్పనిసరి. కాబట్టి కొత్తగా పెళ్ళైన దంపతులు పైన చెప్పిన ఆర్ధిక జాగ్రత్తలు తీసుకుంటే భద్రమైన, భరోసాతో కూడిన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button