Finally Sai Dharam Tej Republic Release Date Out : సాయి ధరమ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ :-

Finally Sai Dharam Tej Republic Release Date Out : సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనితో పాటు తేజ్ కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో అడ్మిట్ అయి రికవర్ అవుతున్నారని కూడా అందరికి తెలిసిందే.
అయితే తేజ్ దేవ కట్టా దర్శకత్వం లో నటించిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్లతో హైప్ లేపింది. సాయి ధరమ్ తేజ్ ఎప్పుడు కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించడం తో మెగా అభిమానుల ఆనందం పట్టరానిది.
అయితే ఈ సినిమాలోని మాస్ సాంగ్ ఇటీవలే విడుదల చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. ఈ పాట యువతులు రిపీట్ మోడ్ లో వింటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు , పాట ఏ రేంజ్ లో హిట్ అయిందని.
అయితే తేజ్ కి యాక్సిడెంట్ అవ్వడం వళ్ళ ఈ సినిమా ఇప్పట్లో విడుదల కష్టం ఏమో అని చిత్ర సీమలో ఇన్నిరోజులు టాక్ నాడించింది. కానీ వీటన్నింటికి చెక్ పెడుతూ చిత్ర బృందం అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 న థియేటర్లో విడుదలకు ముస్తాబవుతోంది అని చెప్పకనే చెప్పెశారు. దీనికి తోడు ఈమధ్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చి సాయి ధరమ్ తేజ్ కి ఎం కాలేదు. ట్రీట్మెంట్ కి రికవరీ అయ్యారు. త్వరలో డిశ్చార్జ్ కూడా అవుతున్నారు అని చెప్పారు. ఈ వార్త విన్న తర్వాత ప్రజలు మరియు అభిమానులు కాస్త మనశ్శాంతి కి లోనయ్యారు.
చూడాలి మరి అక్టోబర్ 1 న తేజ్ రిపబ్లిక్ అభిమానులకి ఏ రేంజ్ లో కనువిందు చేయనుందో.