Finally Prabhas Adhipurush shoot work has completed : మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ పూర్తయింది :-

Finally Prabhas Adhipurush shoot work has completed : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 6 సినిమాలతో బిజీ గా ఉన్నారు. రాధేశ్యామ్ , ఆదిపురుష్ , సాలార్ , ప్రాజెక్ట్ కే , స్పిరిట్ ఇలా అన్ని సినిమాలు అనౌన్స్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో ఫిలిమ్స్ చేస్తున్నారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్నిటికంటే ముందు ఆదిపురుష్ షూటింగ్ పూర్తయింది. మ్యాటర్ లోకి వెళ్తే ప్రభాస్ రాధేశ్యామ్ చేస్తూనే ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాధేశ్యామ్ ఎలాగో షూటింగ్ అయిపోయి విడుదలకు కూడా సిద్ధం అయింది. కానీ ఎపుడో ఆగష్టు 2022 లో విడుదల తేదీ ప్రకటించిన ఆదిపురుష్ చిత్రబృందం 2021 అక్టోబర్ లోనే షూటింగ్ పూర్తిచేసుకోవడం ప్రభాస్ అభిమానులకు షాక్ మరియు ఆనందానికి గురిచేసింది.
షాక్ ఎందుకంటే ఇంకా విడుదలకు సంవత్సరం టైం ఉండగా ఇంత త్వరగా ఎలా షూటింగ్ అయిపోకొట్టారని , ఆనందం ఎందుకంటే ప్రభాస్ ఆదిపురుష్ అప్ డేట్స్ ఇక వస్తూనే ఉంటాయని.
కొంతమంది ఎందుకు ఇంత త్వరగా షూటింగ్ అయిపోకొట్టిన సంవత్సరం వరకు రిలీజ్ చేయకుండా ఆపేస్తున్నారు అనే ప్రశ్నకీ జవాబు ఏంటంటే అందరికి ఆదిపురుష్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కె ఎక్కువ టైం తీసుకుంటుందని , దానికితోడు ఈ సినిమా 3D లో , ఇంకోసారి యానిమేషన్ లో కూడా ఉండబోతుందని చెప్తూవస్తున్నారు. ఇలాంటి సినిమాలకి ఎక్కువ టైం తీసుకునేది గ్రాఫిక్స్ వర్క్ కోసమే.
కాబట్టి ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ అయితే పూర్తయింది ఇంకా చిత్రబృందం గ్రాఫిక్స్ వర్క్ మీద ఫోకస్ చేసి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికి మీకు అర్ధం అయినట్లుంది.
మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ అయితే పూర్తయింది. ఇక త్వరలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూట్ లో పాల్గునబోతున్నట్లు తెలుస్తుంది. సాలార్ మరియు ప్రాజెక్ట్ కే ఒకేసారి డేట్స్ పర్ఫెక్ట్ గా కేటాయించి షూట్ చేయబోతున్నారు. మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి చూడక తప్పదు.