మొత్తానికి విడుదల అవదనుకున్న గోపిచంద్ సినిమా విడుదలవుతుంది:-

Finally Gopichand much awaited film Releasing : వరుస సినిమాలతో బిజీగా ఉన్న, హిట్ వైపు అడుగు వేసి ఎన్నో ఏళ్ళు అయినా ఒకేఒక హీరో గోపీచంద్. ఎన్నో కొత్త ప్రయత్నాలు చేస్తున్న ప్రేక్షకులని మాత్రం అలరించలేక సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.
ఇపుడు విడుదలైన సీటిమార్ సినిమా మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చడం తో గోపీచంద్ హిట్ కల కొంతవరకు నెరవేరింది. సీటిమార్ సక్సెస్ తో ఆనందంగా ఉన్న గోపి చంద్ మరియు అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా గోపీచంద్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన సినిమా ఆరడుగుల బులెట్. ఈ సినిమాని బి. గోపాల్ గారు దర్శకత్వం వహించారు. ఎన్నో కారణాల వాళ్ళ సినిమా వాయిదా పైన వాయిదా పడుతూ విడుదలకు దారిలేకుండా పోయింది. సినిమా షూటింగ్ ఎపుడో కరోనా రాకముందే పూర్తి చేసుకుంది. గోపీచంద్ సరసన నయనతార నటించిన ఈ సినిమా విడుదల మాత్రం జరగడం లేదు అని అభిమానులు బాధ పడిన విషయం అందరికి తెలిసింది.
అయితే ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచింది. అదేంటంటే ఈ సినిమా అక్టోబర్ లో విడుదలకు సిద్ధం అయింది అని చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసారు. ఈ వార్త విన్న గోపీచంద్ అభిమానులు ఆనందానికి హద్దులేకుండా పోయింది. వారి ఆనందాన్ని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు.
సీటిమార్ లాంటి మస్ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ బి.గోపాల్ తో చేసిన ఆరడుగుల బులెట్ రావడం గోపీచంద్ కెరీర్ కి ఎంతో ప్లస్ అవుతుంది అని అందరు అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ద్వారా గోపీచంద్ బ్యాక్ తో బ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టాలని మానసపూర్తిగా కోరుకుందాం.