Finally Gopichand much awaited film releasing : మొత్తానికి గోపిచంద్ ఆరడుగుల బులెట్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ :-

Finally Gopichand much awaited film releasing : గోపీచంద్ , నయనతార కలిసి చేసిన సినిమా ఆరడుగుల బులెట్ . ఈ సినిమా ఎపుడో 2017 లో షూటింగ్ పూర్తిచేసుకొని విడుదల కాకుండా ఎన్నో కారణాలతో ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ దాదాపు 6 సినిమాలు విడుదల చేసి హిట్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇదివరకే గోపీచంద్ , తమన్నా కలిసి నటించిన సీటిమార్ సినిమా కూడా విడుదలయి ఘన విజయం సాధించింది.
అయితే ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ఆరడుగుల బులెట్ సినిమా కోసమే గోపీచంద్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికిగల కారణాలు కూడా ఉన్నాయి.
అందులో ఒకటి ఈ సినిమా దర్శకుడైన బి.గోపాల్. బి.గోపాల్ గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు. అలంటి దర్శకుడితో గోపీచంద్ సినిమా అంటే ఇంద్ర రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఊహించుకోవటంలో తప్పు లేదుగా.
అయితే ఎన్నో కారణాల చేత వాయిదాలు పడ్డ ఈ సినిమా, మొత్తానికి అన్ని అడ్డంకులు దాటేసి అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరస నయనతార నటిస్తుంది.
దాదాపు 4 ఏళ్ళ గోపి అభిమానుల నీరక్షణకు ఈ నెల 8 న ఫలితము దక్కబోతోంది. చూడాలి మరి గోపీచంద్ , బి.గోపాల్ , నయనతార కలిసి ఆరడుగుల బులెట్ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కించారో.