Tollywood news in telugu

Finally F3 Release Date Announced : మొత్తానికి F3 విడుదల తేదీ ఫిక్స్ :-

Finally F3 Release Date Announced

Finally F3 Release Date Announced : విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , మిల్కీ బ్యూటీస్ తమన్నా , మెహ్రీన్ కలిసి 2019 లో F2 సినిమా ద్వారా చేసిన హుంగామ ఇప్పటికి మరిచిపోలేరు , ముఖ్యంగా పెళ్ళైన వారు ఇప్పటికి వెంకీ హస్సన్ వేస్తుంటారు వారి ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి. ఈ మొత్తం క్రెడిట్స్ దర్శకుడు అయినా అనిల్ రావిపూడి కె దక్కుతుంది.

ఇలాంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచినా F2 కి సీక్వెల్ గా F3 రాబోతుంది అని అనిల్ రావిపూడి మరియు చిత్రబృందం అధికారికంగా ప్రకటించినప్పటినుంచి ఈసారి ఏ కాన్సెప్ట్ తో రాబోతున్నారని అందరు అనుకుంటుండగా F2 భార్య భర్తల మీద సాగింది ఇపుడు F3 చాల ఫ్రెష్ కాన్సెప్ట్ ఏమంటే F2 లో ఉన్న జంటలే ఉంటారు.

ఈసారి ఈ భార్య భర్తలు కలిసి డబ్బు మీద ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చుపియబోతున్నారని చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్యాచ్ అప్ సీన్స్ కొన్ని షూట్ చేసేస్తే షూటింగ్ పూర్తయిపోయినట్లే.

అయితే కాసేపటి క్రితమే ఈ సినిమా ఎపుడు విడుదల కాబోతుందో అన్న ప్రశ్న పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఈ సినిమా ఫిబ్రవరి 25 , 2022 న విడుదల సిద్ధం చేశారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

ప్రొమోషన్స్ కూడా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చేయబోతున్నారని మొన్న దసరా పండుగ కానుకగా విడుదలయిన వీడియో చూస్తేనే అర్ధం అయింది. చూడాలి మరి F3 లో కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతుందో. అనిల్ మార్క్ కామెడీ తో ప్రేక్షకులు F2 మరిచిపోయి F3 మాయలో పడిపోతారేమో చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button