Finally Akhanda Shoot wrapped up : మొత్తానికి బాలయ్య అఖండ షూటింగ్ పూర్తయింది :-

Finally Akhanda Shoot wrapped up : బాలయ్య బాబు మరియు బోయపాటి శ్రీను కలిసి సినిమా చేస్తున్నారంటే అభిమానులకు ఎక్కడ లేనంత ఆనందకరమైన విషయం గా కలినిపిస్తుంది. దీనికి గల కారణం సింహ మరియు లెజెండ్ సినిమాలు థియేటర్లో మరియు బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన భీభత్సం ఏ ఉదాహరణ.
అలాంటి కాంబినేషన్ ముచ్చటగా మూడవసారి కలిసి చేయబోతున్నారన్నా విషయం తెలియగానే బ్లాక్ బస్టర్ రి-లోడింగ్ అని అభిమానులు బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు.
అయితే అఖండ సినిమాలోని పాట మరియు బాలయ్య బాబు నెవెర్ బిఫోర్ లుక్స్ అభిమానులకే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి.
ఎపుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణం చేత విడుదల వాయిదా మీద వాయిదా పడుతూ షూటింగ్ పూర్తవక నానా ఇబ్బందులు ఎదురుకుంది. ఏదేమైనా లాక్ డౌన్ ఎత్తేసిన ఇన్నాళ్లకి షూటింగ్ పూర్తయింది. షూటింగ్ పూర్తయిన సందర్బంగా చిత్రబృందం కలిసి పార్టీ చేసుకున్నారు.
మొత్తానికి అఖండ షూటింగ్ పూర్తయింది. ఇంకా అధికారికంగా ఎపుడు విడుదల చేస్తారనేదే ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. చూడాలి మరి బాలయ్య బాబు మరియు బోయపాటి శ్రీను కలిసి ఏ రోజున విడుదల చేయడానికి సిద్ధపడుతారో మరియు ఈసారి ఏ రేంజ్ లో హంగామా చేయబోతున్నారో.